మెగా "మౌనం".. అల్లు "కొంప" ముంచుతుందా..? ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!
అలాంటి ఆయన సోషల్ మీడియాలో పుష్ప2 పై ఈ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతున్న ఎందుకు మాట్లాడడం లేదు . ఆయన మౌనం వెనక అర్థం ఏంటి ..? నిజంగానే మీ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి ఏవైనా గొడవలు ఉండొచ్చు కానీ మీ కారణంగా ఒక సెలబ్రిటీ లైఫ్ పాడైపోకూడదు కదా..? రామ్ చరణ్ విషయం పక్కనపడితే మెగాస్టార్ చిరంజీవి వయసులో పెద్దవారు ..రామ్ చరణ్ - అల్లు అర్జున్ ఇంచుమించు ఒకే తరహాలో ఉండేవారు . ఆ కోపం ఆవేశం అందరికీ ఉంటుంది . కానీ చిరంజీవి ఇలాంటివి ఎన్నెన్నో చూసి పైకి ఎదిగిన వ్యక్తి. పిల్లల భవిష్యత్తు కోసం అయినా ఒక మెట్టు దిగి ఫ్యాన్స్ ట్రోలింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టొచ్చుగా.
ఒక్క మాట ఒకే ఒక్క మాట మా ఫ్యామిలీ మధ్య గొడవలు లేవు అంటూ ఒక్క స్టేట్మెంట్ పాస్ చేసిన సరే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అది మంచి ప్లస్ గా మారుతుంది. మరింత స్థాయిలో సపోర్ట్ చేసేలా చేస్తుంది
లేకపోతే చిరంజీవి ఎప్పుడూ కూడా ఇలా బిహేవ్ చేసే వారే కాదు. అందరికీ సపోర్ట్ చేస్తూ వస్తారు. మొనటికి మొన్న జీబ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సత్యదేవ్ కి ఎలా సపోర్ట్ చేసారో అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది అల్లు అర్జున్ లాంటి టాలెంటెడ్ హీరోని తొక్కేయడానికి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ మెగాస్టార్ చిరంజీవికి తెలియనిది కాదు . మరి ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు..? మెగా మౌనం అల్లు కొంప ముంచబోతుందా..? అంటూ జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు..!