ఈ మధ్య కాలంలో వచ్చే ప్రతి సినిమా సూపర్ హిట్ అవ్వట్లేదు. రిలీజ్ కు ముందు భారీ అంచనాలతో వచ్చి రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లు అయ్యాయి. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్ల లోకి వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. స్టార్ హీరోల సినిమాలు సైతం భారీ అంచనాలతో వచ్చి బోల్తా కొట్టాయి. ఈ క్రమం లోనే నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కంగువ కు మొదటి షో నుంచే నెగిటివ్ రెస్పాన్స్ రాగా, సాయంత్రానికి ఫ్లాప్ సినిమాగా డిక్లేర్ చేసేశారు.హీరో సూర్య ,దర్శకుడు శివ , నిర్మాత జ్ఞానవేల్ రాజా కంగువ రెండు వేల కోట్ల రూపాయల వసూళ్లు కొల్లగొట్టడం ఖాయం అంటూ చేసిన హడావుడి అందరికీ గుర్తుండే ఉంటుంది. విడుదలైన 16 రోజులకు తిప్పి కొడితే 100 కోట్ల రూపాయల గ్రాస్ కూడా చేయలేకపోయింది ఈ చిత్రం. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న విషయం తెలిసిందే.సినిమా ప్రమోట్ చేయడం ఎంత ముఖ్యమో, ఇలా ట్రోల్స్ కి దొరక్కుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్ అనే విషయం ఇప్పుడైనా దర్శకనిర్మాత లకు అర్థమై ఉంటుంది. ఇకపోతే అమెజాన్ ప్రైమ్ టీమ్ వాళ్లు కూడా ఈ లీక్ విషయం లో చాలా సీరియస్ అయ్యారట. కానీ ఇప్పుడు ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. ఏదేమైనా కంగువ ఈ ఏడాది బిగ్గెస్ట్ ట్రోల్ మెటీరియల్ మరియు బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అయిపోయింది.ఈ భారీ బడ్జెట్ చిత్రం రూ. 130 కోట్ల నష్టంతో ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచినట్లు వెల్లడించాయి ఇప్పటివరకు ప్రభాస్ నటించిన రాదేశాం సినిమా పేరిట ఈ చెత్త రికార్డు ఉండేది. రాధేశ్యాం మూవీ రూ.120 కోట్లు నష్టపోయింది. ఈ క్రమంలోడిజాస్టర్ బరిలో కంగువా మూవీ రాదే శ్యామును మించిపోయింది.