దేవర ఎంట్రీ లేట్ అయినా.. గూస్ బంప్స్ తెప్పించాడుగా..!!

murali krishna
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించాడు.. ఆర్ఆర్ఆర్ వంటి భారీ సినిమా తరువాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సినిమాను మేకర్స్ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేసారు.. దాదాపు 6 ఏళ్ల తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకులు భారీగా థియేటర్స్ కి తరలి వచ్చారు.. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఎన్టీఆర్ నటన, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్.. దర్శకుడు కొరటాల ఈ సినిమాతో   పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకులని మెప్పించడంలో కాస్త తడబడ్డాడు.. ముందుగా ఈ సినిమాను  ఒకే సినిమాగా తెరకెక్కించాలని ప్లాన్ చేసిన కానీ నిడివి ఎక్కువగా ఉండటంతో రెండు పార్ట్స్ గా తెరకెక్కించారు.. 

మొదటి పార్ట్ చివరి లో సెకండ్ పార్ట్ కి అద్భుతమైన లీడ్ ఇచ్చారు. తెలిసిన కథ కావడంతో ప్రేక్షకులకి ఈ సినిమా కొత్తగా అనిపించలేదు.. ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా ఈ సినిమాకు దాదాపు 550 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.. త్వరలోనే పార్ట్ 2 ని తెరకెక్కిస్తామని మేకర్స్ తెలిపారు.. కానీ పార్ట్ 2 ఉంటుందో లేదో అనేది అనుమానమే.. ఇదిలా ఉంటే కొరటాల శివ సినిమాల్లో హీరోల ఎంట్రీ కాస్త ఆలస్యంగా ఉంటుంది..ఎన్టీఆర్ తో కొరటాల చేసిన రెండు సినిమాల్లో సైతం హీరో ఎంట్రీ 15 నుంచి 20 నిమిషాల ఆలస్యంగా చూపించాడు.. ఈ రెండు సినిమాల్లో కథే మెయిన్ హైలైట్ అని చెప్పాలి.. కథలో భాగంగానే ఎన్టీఆర్ ఎంట్రీ ఉందని కొరటాల చెప్పారు.. అయితే హీరో ఎంట్రీ ఆలస్యం అయితే ఫ్యాన్స్ కి విసుగు వస్తుంది.. కానీ కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతూ భారీ ఎలివేషన్ తో హీరో ఎంట్రీ వస్తే అది ఫ్యాన్స్ ని మరింత కిక్ ఇస్తుందని మేకర్స్ నమ్ముతారు.. ఆ సూత్రమే తన సినిమాల్లో కొరటాల ఉపయోగించారు..

దేవరలో ఎంట్రీ సీన్ మాత్రం ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: