ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన థియేటర్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు దేశ వ్యాప్తంగా ప్రచారాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో గత కొంత కాలం నుండి ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి సాంగ్స్ ను విడుదల చేస్తూ వస్తుంది.
అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ నాలుగు పాటలను విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ నుండి నాలుగవ పాటగా తాజాగా ఈ మూవీ బృందం వారు ఫీలింగ్స్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఇకపోతే ఈ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటలో 30.25 మిలియన్ వ్యూస్ ... 526.4 కే లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీ లోని నాలుగవ సాంగ్ అయినటువంటి ఫీలింగ్స్ పాటకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించిన ఈ మూవీ బృందం వారు ఈ సాంగ్ కంటే ముందు ఈ మూవీ నుండి కిస్సిక్ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది.
ఇక ఈ సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ తో పోలిస్తే ఫీలింగ్స్ సాంగ్ కో 24 గంటల్లో ఆ స్థాయి రెస్పాన్స్ రాలేదు. ఇకపోతే ఫీలింగ్స్ సాంగులో అల్లు అర్జున్ , రష్మిక డాన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సాంగ్ లిరికల్ వీడియోలో వీరిద్దరూ తమ డాన్స్ మూమెంట్స్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. ఇకపోతే ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.