నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య కొంత కాలం క్రితం వరుస అపజయాలను ఎదుర్కొన్నాడు. అలాంటి సమయంలోనే అఖండ మూవీ తో బాలయ్య బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత బాలయ్య నటించిన వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇక ప్రస్తుతం బాలయ్య , బాబి దర్శకత్వంలో దుకు మహారాజ్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు ఊర్వశి రౌటేలా , శ్రద్ధ శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ , వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కానున్నాయి. ఇక గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన పనులు చాలా వరకు ముగిసిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి ఏకంగా మూడు పాటలను కూడా విడుదల చేశారు. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సంబంధించిన కేవలం ఒకే ఒక పాట షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు సినిమాలతో పోలిస్తే డాకు మహారాజ్ చాలా వరకు వెనకబడిపోయినట్లు తెలుస్తోంది. ఎందుకు అంటే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ ఎంత పూర్తి అయ్యిందో పెద్దగా క్లారిటీ రావడం లేదు. ఈ మూవీ షూటింగ్ చాలానే బ్యాలెన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత బాలయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడం వల్లే ఈ సినిమా షూటింగ్ డిలే అయింది అని లేకపోయి ఉంటే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యేది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.