కల్కి, సలార్ ల్లో ప్రభాస్ లేట్ ఎంట్రీ..కానీ గూస్ బంప్స్ రావాల్సిందే ?
బాహుబలి తర్వాత కల్కి అలాగే సలార్ సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకున్నాడు ప్రభాస్. అయితే ఈ రెండు సినిమాల్లో కూడా లేటుగా... హీరో ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. అలా లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కూడా... సినిమాలో ప్రభాస్ పాత్ర ఒక రేంజ్ కి వెళ్ళిపోతుంది. దీంతో ఈ రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా కల్కి సినిమా గురించి మాట్లాడుతున్నట్లయితే.. ఈ సినిమా.. బాలయ్య నటించిన ఆదిత్య సినిమా తరహా లోనే ఉంటుంది.
మొదటి 20 నిమిషాలు అసలు సినిమాలో ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫైట్ సీన్ అదిరిపోతుంది. ఇక ఆ తర్వాత... అమితాబచ్చన్ , ప్రభాస్ మధ్య సీన్స్ అదరహో అందిస్తాయి. అక్కడే ప్రభాస్, అమితాబచ్చన్ మధ్య ఫైట్ కూడా జరుగుతుంది. అక్కడి నుంచి ప్రభాస్ పాత్ర హైలెట్ కావడం జరుగుతుంది. దాంతో సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక సలార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఈ సినిమా ప్రారంభం కాగానే... సీజ్ ఫైర్ కోటరీ గురించి స్టోరీ నడుస్తుంది. సినిమా ప్రారంభమైన నుంచి పృధ్విరాజ్ గురించే .. స్టోరీ లైన్ ఉంటుంది. కానీ ప్రభాస్... ఒక 30 నిమిషాల తర్వాత ఎంట్రీ ఇస్తాడు. అది కూడా ఫైట్ సీన్ తో దుమ్ము లేపుతాడు. తన తల్లి ముందే ఫైట్ చేస్తూ.. గూస్ బంప్స్ తెప్పిస్తాడు. ఇక.. ఫ్లాష్ బ్యాక్ లో.. సీజ్ ఫైర్ లో అడుగుపెట్టిన ప్రభాస్... పాత్ర అందర్నీ ఆకట్టుకుంటుంది. విలన్సును చంపే విధానం కూడా... అదిరిపోతుంది. ఇంత సినిమా బంపర్ హిట్ అయింది.