ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2 “.ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాపై భారీగా అంచనాలు వున్నాయి..గతంలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది.. ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా వున్నారు..ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. రిలీజ్ దగ్గరపడుతుందటంతో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు..దేశ వ్యాప్తంగా భారీ ఈవెంట్స్ నిర్వహించిన మేకర్స్ తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా హైదరాబాదులోని పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు..
ఈ ఈవెంట్లో సినిమాకు సంబంధించిన చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు దర్శకులు కూడా ప్రత్యేక అతిధులుగా పాల్గొన్నారు.అలాగే దర్శకదీరుడు రాజమౌళి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఆయన సినిమా గురించి మాట్లాడి పుష్ప రాజ్ ని ఆకాశానికి ఎత్తేసారు..
దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. పుష్ప 1 సినిమా ప్రీ రిలీజ్ టైమ్ లో బన్నీకి నేను ఒకటే చెప్పాను. నార్త్ ఇండియాని టార్గెట్ చేయండి ..అక్కడ ఫ్యాన్స్ పుష్ప కోసం పడి చచ్చిపోతున్నారు.ఏ చిన్న చోట కూడా ప్రమోషన్స్ చేయకుండా ఉండకండి అని చెప్పాను. అయితే ఇప్పుడు పుష్ప 2 కి మాత్రం అలా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదు.ఎందుకంటే దేశం మొత్తం అలాగే ప్రపంచంలో ఉన్నా ఇండియన్స్ అంతా కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టికెట్లు కూడా కొనేసుకుని పెట్టుకున్నారు...రిలీజ్ రోజు పుష్ప రాజ్ విధ్వంసం చూస్తారని రాజమౌళి తెలిపారు..
ఈ సినిమా గురించి రాజమౌళి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు.. మూడు నెలల క్రితం రామోజీ ఫిలిం సిటీలో పుష్ప 2 షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్లాను. అక్కడ సుకుమార్ ఒక సన్నివేశం చూపించారు. అది ఇంట్రడక్షన్ సీన్ ఆఫ్ పుష్ప రాజ్. ఆ సీన్ మొత్తం నేను చూసాను..చూసిన తర్వాత సుకుమార్ కి ఒకటే చెప్పాను. సీన్ కి దేవి ఎంత అద్భుతంగా మ్యూజిక్ ఇవ్వగలిగితే అంత హైలెట్ అవుతుందని చెప్పాను. అంతా ఎక్సలెంట్ గా ఆ సీన్ ఉందని రాజమౌళి తెలిపారు..