చిరంజీవి రీ ఎంట్రి ఇచ్చాక ఆయన రీ ఎంట్రీలో అద్భుతమైన హిట్ కొట్టిన సినిమా వాల్తేరు వీరయ్య.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్ గా..రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలోని పాటలు మ్యూజిక్ అన్ని సినీ ప్రియులను ఎంతగా ఆక్కట్టుకున్నాయో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా బాసూ వేర్ ఈజ్ ద పార్టీ అనే ఐటెం సాంగ్ లో మెరిసి సినిమాకి మరింత ప్లస్ అయింది. అయితే అలాంటి వాల్తేరు వీరయ్య మూవీ విశేషాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
వాల్తేరు వీరయ్య అని సినిమా టైటిల్ పెట్టడానికి కారణం చిరంజీవి తండ్రి సహోద్యోగిగా పనిచేసిన వీరయ్య కారణం. పోలీస్ శాఖలో పనిచేసిన వీరయ్య చిరంజీవి తండ్రికి సహోద్యోగి కావడంతో ఇండస్ట్రీలోకి వచ్చే ముందు చిరంజీవికి సంబంధించి ఎన్నో అందమైన ఫోటోలు తీసారట .అయితే ఈ ఫోటోలు చిరంజీవి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో బాగా ఉపయోగపడ్డాయట. అయితే ఈ సినిమా లో మత్స్యకారులకు నాయకుడిగా చిరంజీవి కనిపిస్తారు.అయితే దీనికి సంబంధించిన ఫోటోలు నిర్మాతలకు, దర్శకుడికి పంపడానికి వీరయ్య హెల్ప్ చేశారు. అలా ఈ సినిమా విశాఖపట్నం బ్యాక్ డ్రాప్ తో రావడంతో ఈ సినిమాకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ అయితే బాగుంటుంది అని వీరయ్యనే సజెస్ట్ చేశారట.
అలా చిరంజీవి మూవీకి వాల్తేర్ వీరయ్య టైటిల్ వచ్చింది.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వై.రవిశంకర్, నవీన్ యేర్నేని లు నిర్మాతలుగా చేసిన ఈ సినిమా గత ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. ఈ సినిమాలో చిరంజీవి ఎంట్రీ లేటుగా ఇస్తాడు.అయినప్పటికీ అద్భుతమైన కథతో చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ లో అత్యధిక కలెక్షన్లు సంపాదించిన సినిమాగా ఈ మూవీకి పేరు వచ్చింది.ఇక చిరంజీవి సినిమాకి పోటీగా వచ్చిన బాలయ్య వీరసింహారెడ్డి,అలాగే కోలీవుడ్ నటుడు అజిత్ నటించిన తునివు, విజయ్ నటించిన వారసుడు సినిమాలు వచ్చినప్పటికీ వీరందరిలో ఎక్కువ కలెక్షన్లు సంపాదించిన సినిమాగా వాల్తేరు వీరయ్య పేరు తెచ్చుకుంది.