ఆ స్టార్ హీరోకి ఒక ప్లాఫ్ కూడా ఇవ్వని రాఘవేంద్రరావు ఇంతకీ ఆ హీరో ఎవరంటే..!

Amruth kumar
తెలుగు చిత్ర పరిశ్రమలో కమర్షియల్ సినిమాను కొత్త పుంత‌లు తొక్కించిన దర్శకులలో దర్శకేంద్రు కే రాఘవేంద్రరావు ముందు వ‌ర‌స‌లో ఉంటారు .. ఒక సినిమాను ఎంతో అద్భుతమైన దృశ్య కావ్యంలా తెరకెక్కించడంలో రారాఘవేంద్రరావు ది రూట్ ఎంతో సపరేట్  అనే చెప్పాలి.. ఎందరో స్టార్ హీరోలకు వారి కెరియర్లో ఎన్నో సూపర్ హిట్ లు ఇచ్చారు .. కానీ ఇదే సమయంలో ఒక హీరోకు మాత్రం అయ‌న‌ తీసిన సినిమాలలో ఆ హీరోకి ఒక్క డిజాస్టర్ కూడా ఇవ్వలేదు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఇక్క‌డ‌ చూద్దాం. తెలుగు చిత్ర పరిశ్రమ లో దర్శకేంద్రుకే రాఘవేంద్రరావు - సూపర్ స్టార్ కృష్ణ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి .. మొత్తంగా వీరి కాంబినేషన్లో 9 సినిమాలు వచ్చాయి .. దాదాపు అన్ని సినిమాలు హిట్ సినిమాలుగా నిలిచాయి. వాటిలో ఎనిమిది సినిమాల్లో కృష్ణ హీరోగా నటించారు. ఒక సినిమాలో మాత్రం గెస్ట్ రోల్ పోషించారు.


కృష్ణ - రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన సినిమాల విషయానికి వస్తే.. ముందుగా వీరి కాంబినేషన్లో బలే కృష్ణుడు సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత రెండో సినిమాగా ఘరానా దొంగ సినిమా వచ్చింది. ఈ సినిమాలో కృష్ణకి జంటగా శ్రీదేవి నటించింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక కృష్ణ , రాఘవేంద్ర కాంబోలో వచ్చిన మూడో సినిమా ఊరుకు మొనగాడు.. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. కృష్ణ , రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన నాలుగో సినిమా అడవి సింహాలు.. ఈ సినిమాలో కృష్ణతో పాటు కృష్ణంరాజు కూడా హీరోగా నటించారట .. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ కాంబోలో వచ్చిన ఐదో సినిమా శక్తి ఈ సినిమాల్లో కృష్ణ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాబిన‌మయం చేశాడు. ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలిచింది. ఇక కృష్ణ రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన ఆరో సినిమా ఇద్దరు దొంగలు. ఈ సినిమాలో కృష్ణతో పాటు అందాల నటుడు శోభన్ బాబు కూడా మరో హీరోగా నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గాా నిలిచింది.

కృష్ణ రాఘవేంద్రరావు కాంబోలో  వచ్చిన ఏడో సినిమా.. అగ్నిపర్వతం.. ఈ సినిమా వీరిద్దరి కాంబినేషన్ లోనే వచ్చిన అన్ని సినిమాలు కన్నా ఓ గోప్ప‌ సినిమాగా నిలిచింది. కృష్ణ , రాఘవేందర్రావు కాంబినేషన్లో వచ్చిన ఎనిమిదో సినిమా వజ్రాయుధం. ఈ సినిమా కూడా హిట్ సినిమాగా నిలిచింది. కృష్ణా రాఘవేంద్రరావు కాంబినేషన్లు వచ్చిన తొమ్మిదో సినిమా రాజకుమారుడు. ఈ సినిమాలో కృష్ణ గెస్ట్ రోల్ లో కాసేపు కనిపించాడు. సినిమాను మహేష్ ను హీరోగా పరిచయం చేస్తూ చేసిన సినిమా. మహేష్ కృష్ణ వారసుడుగా తొలి సినిమాతోనే సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ విధంగా ఈ ఇద్దరి కలయికలు వచ్చిన తొమ్మిది సినిమాలలో 8 సినిమాల్లో కృష్ణ హీరోగా నటించారు. అతిథి పాత్రలో రాజకుమారుడు సినిమాలో మెరిసేరు మొత్తంగా విడుదల కలర్ లో వచ్చిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: