మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు, ఈయన సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి బాస్ ఆఫ్ మాసెస్ గా చిరంజీవి తనకంటూ ప్రత్యేకమైన ఈమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ముఖ్యంగా ఎలాంటి సినీ నేపథత్యం లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఈయన దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న రారాజుగా ఎదిగారు. ఇక ఇండస్ట్రీలో ఈయన ఎంతోమందికి స్పూర్తి.ఇదిలావుండగా చిరంజీవి కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. అంతేకాకుండా.. అప్పటిలో తెలుగు సినిమా రికార్డులు తిరగరాసిన సినిమాగా ఇంద్ర నిలిచింది. అయితే ఈ సినిమా 2002 జులై 22న విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్స్ తో దూసుకుపోయింది. ఇక ఆ సినిమాలో ఒక్కో డైలాగ్ వేరే లెవల్ అనే చెప్పవచ్చు.రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. ఇంద్ర చిత్రంలో చిరంజీవికి జోడిగా ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు.
ఈ నేపథ్యంలో ఇంద్ర రిలీజ్ అయి అఖండ విజయాన్ని అందుకున్న తర్వాత చిరంజీవి చిత్ర యూనిట్ కి పార్టీ ఇచ్చారట. రచయిత దర్శకుడు బివిఎస్ రవి ఓ ఇంటర్వ్యూలో ఆ పార్టీలో జరిగిన సంఘటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరదాగా పార్టీ జరుగుతోంది. చిత్ర యూనిట్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. ఇంద్ర విజయంలో క్రెడిట్ ఎవరికి దక్కుతుంది అనే చర్చ జరిగిందట. ఎక్కువ క్రెడిట్ చిరంజీవి గారిది అని చాలా మంది చెప్పారు. మణిశర్మకి కూడా క్రెడిట్ దక్కుతుందని కొందరు.. కొందరు డైరెక్టర్ బి గోపాల్ కి దక్కుతుంది అని ఇలా చర్చ జరుగుతూ ఉంది. కానీ చిరంజీవి గారు ఒకే ఒక్కరికి ఇంద్ర మూవీ క్రెడిట్ మొత్తం ఇచ్చేశారట. ఆయన ఎవరో కాదు రచయిత చిన్ని కృష్ణ. ఇంద్ర ఇంత విజయం సాధించింది అంటే అందుకు ప్రధాన కారణం చిన్ని కృష్ణ అందించిన కథే అని చిరంజీవి అన్నారట. దీనితో అంతా షాక్ అయి ఒక్కసారిగా చప్పట్లు కొట్టినట్లు బివిఎస్ రవి తెలిపారు. చిన్ని కృష్ణ కథ ఇవ్వకపోతే అసలు ఇంద్ర చిత్రమే లేదు అనేది చిరంజీవి అభిప్రాయం.అలాగే ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించిన సంగతి అందరికీ తెలిసిందే.