పుష్ప2 స్టేజ్ పై గబ్బు గబ్బు చేసిన సింగర్ సుబ్లాషిణి.. బూతులు తిడుతున్న బన్నీ ఫ్యాన్స్..!
అయితే రీసెంట్గా ఎంతో గ్రాండ్గా జరిగిన పుష్ప2 ఈవెంట్లో సైతం ఇదేవిధంగా చేశారు. నిన్న హైదరాబాద్లో పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఎంత ఘనంగా అంటే చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోలేదు. అంత ఘనంగా జరిగింది . పుష్ప2 సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ స్టేజి పైకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధీమా వ్యక్తం చేశారు . అయితే ఇదే మూమెంట్లో సినిమాలో పాటలు పాడిన కొంతమంది సింగర్స్ చేత స్టేజిపై పాటలు పాడించారు.
మరి ముఖ్యంగా పుష్ప2 సినిమాను ఓ రేంజ్ లో ముందుకు తీసుకెళ్తున్న స్పెషల్ సాంగ్ "దెబ్బలు పడతాయిరో" పాట కూడా స్టేజిపై పాడించారు . అయితే లైవ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పారు కానీ అది లైఫ్ పెర్ఫార్మెన్స్ కాదు . వెనకాల బ్యాక్ గ్రౌండ్ లో పాట ప్లే అవుతూ ఉంటే స్టేజ్ పైకి వచ్చిన సింగర్ జస్ట్ లిప్ సింక్ ఇచ్చింది. ఆ విషయం అక్కడ ఉండే జనాలకి టీవీలో చూస్తున్న జనాలకి క్లియర్గా అర్థమైపోయింది . దీంతో బన్నీ ఫాన్స్ బూతులు తిడుతున్నారు. శుభ్రంగా పాట వచ్చినప్పుడు స్టేజిపై పాట పాడొచ్చుగా..? ఎందుకని వెనక రికార్డింగ్.. స్టేజ్ పై నీ యాక్టింగ్.. ఇదేమి కొత్త పద్ధతి .. పుష్ప2 ఈవెంట్ ని గబ్బు గబ్బు చేసేసారు..? అంటూ ఓ రేంజ్ లో పాట పాడిన సింగర్ సుబ్లాషిణి పై మేకర్స్ పై ట్రోల్ చేస్తున్నారు.