అఖండ: అఘోరాగా బాలకృష్ణ.. అందరూ వణికిపోవాల్సిందే..!
ఇక రెండు సంవత్సరాల కిందట అఖండ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నందమూరి బాలయ్య హీరోగా చేయగా.... ప్రగ్యా జైస్వాల్ అలాగే పూర్ణ లాంటి కీలక నటీనటులు ఉన్నారు. మాస్ యాంగిల్ లో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు బాలయ్యలు... అంటే డ్యూయల్ రోల్ లో బాలయ్య కనిపిస్తాడు. కొడుకు పాత్రలో ఒక బాలయ్య కనిపిస్తే... అఘోర పాత్రలో... మరో బాలయ్య కనిపిస్తాడు.
అయితే మొదటి భాగంలో.. అఘోర పాత్ర కనిపించదు. ఎప్పుడైతే...మురళీకృష్ణ పాత్రలో ఉన్న బాలయ్య కుటుంబం.. ఆపదలో ఉన్నప్పుడు అఘోర ఎంట్రీ ఇస్తాడు. అప్పటివరకు అఘోర పాత్రలో ఉన్న బాలయ్య కనిపించడు. ఇక సెకండ్ హాఫ్ లో.. మురళీకృష్ణ కుటుంబం ఆపదలో పడుతుంది. అటు మురళీకృష్ణ జైలు పాలవుతాడు. అదే సమయంలో అఘోర పాత్రలో ఉన్న నందమూరి బాలయ్య గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడు.
ఇక అక్కడి నుంచి.. సినిమా పూర్తిగా మారిపోతుంది. ఆ సమయంలో నందమూరి బాలయ్య ఎంట్రీ చూస్తే అందరికీ గూసుబాంబ్స్ వస్తాయి. సినిమా ఒక్కసారిగా.. బ్లాస్ట్ అవుతుంది. అఘోర పాత్రలో ఉన్న బాలయ్య చేసే ఫైట్స్.. అందరికీ ఉత్సాహాన్ని ఇస్తుంది. మాస్ ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ వస్తుందని చెప్పవచ్చు. సింపుల్గా చెప్పాలంటే అగోర వచ్చిన తర్వాత సినిమా మొత్తం ఎక్కడికో వెళ్తుంది. దీంతో సినిమా గ్రాండ్ విక్టరీ కొట్టింది.