ఇంతకీ పుష్ప2 సక్సెస్ క్రెడిట్ ఎవ‌రికి.. పుష్ప రాజ్ ఏం చేస్తాడో..?

Amruth kumar
మరో 48 గంటల్లో పుష్ప 2 థియేటర్లో సందడి చేయడానికి రెడీగా ఉంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా హిట్ అయితే హీరో అకౌంట్లోకి ప్లాప్‌ అయితే డైరెక్టర్ ఖాతాలోకి వేస్తుంటారు .. ఇది ఇప్పటి వరకు ప్రతి సినిమా విషయంలో జరిగింది .. చాలా రేర్ గా హీరో తన సినిమా సక్సెస్ కి డైరెక్టర్ కి క్రెడిట్ ఇస్తూ ఉంటారు .. మహేష్ ఎప్పుడు తన దర్శకులకు పూర్తిస్థాయి క్రెడిట్ ఇస్తాడు .. కానీ మిగతా హీరోలు మాత్రం .. చాలా అరుదుగా తమ దర్శకులకు నిర్మాతలకు క్రెడిట్ ఇస్తూ ఉంటారు.

అల్లు అర్జున్ తొలిసారిగా పుష్ప సక్సెస్ మీట్ లో తన కెరీర్ ఎదుగుదలకు ముఖ్య కారణం సుకుమార్ అంటూ పేర్కొన్నాడు. అయితే పుష్ప 2 కి మొత్తం సమీకరణాలు మారిపోయాయి .. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ సినిమాకి మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. ప్రధానంగా ఈ సినిమా బాలీవుడ్ లో ప్రమోషన్స్‌ కి అల్లు అర్జున్ ఫేస్ ఆఫ్ ది మూవీ గా ఉన్నాడు . ఇక నిజానికి సుకుమార్ 2018 నుంచి పుష్ప మీదే ఉన్నాడు .. ఈ ఆరేళ్లలో సుకుమార్ తీసిన సినిమాలు రెండే .. ఇంకా గట్టిగా చెప్పాలంటే అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఇచ్చిన టైం మూడున్నర సంవత్సరాలు..

అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటం కారణంగా సుకుమా... సుకుమార్ ఇప్ప‌టి వరకు ఒక్కటంటే ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కి కూడా అటెండ్  కాలేదు .. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ తో పాటుగా సుకుమార్ మార్కు కోసం ఎదురు చూస్తున్నారు .. కానీ నార్త్‌ లో ఎవరికి పెద్దగా సుకుమార్ తెలియదు .. మరి సినిమా రిలీజ్ అయ్యాక నిజంగా బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తే మాత్రం  సుకుమార్‌కు క్రెడిట్ ఇస్తారా లేక అల్లు అర్జున్ ఖాతాలో వేసుకుంటారా అనేది ప్రస్తుతం ఇప్పుడు హాట్‌ టాపిక్ గా మారింది ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: