పార్ట్ టూ మళ్లీ అదే ప్లాన్ ఆ .. గేమ్ ఛేంజర్‌లో కూడా శంకర్ బుర్ర మారలేదా..?

Amruth kumar
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత సోలో హీరో గా వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా పై టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవ‌ల్‌లో భారీ అంచనాలు ఉన్నాయి .. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీరా అద్వానీ , అంజలి హీరోయిన్లుగా ఈ సినిమాలో నటిస్తున్నారు .. స్టార్‌ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించారు .. ప్రస్తుతానికి గేమ్ చేంజర్ ప్రమోషన్లు గట్టిగా సాగుతున్న అప్పటికీ ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక కొత్త టాక్ బయటకు వస్తూనే ఉంది .

ఈ సినిమా ను ఒకే భాగంగా రిలీజ్ కావాల్సి ఉండగా .. ఇప్పుడు గేమ్ చేంజర్ 2 అనేది కొత్తగా ఉండబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి  . పాన్ ఇండియా సినిమాలు సాధించిన విజయాలతో మేకర్స్ దృష్టిలో పెట్టుకుని పార్ట్ 2 ను తీసే ఉద్దేశంలో ఉన్నారట . గేమ్ చేంజర్‌ సినిమా కూడా అదే దారి లో రెండు భాగాలు గా ఈ కథను తీస్తారని అంటున్నారు .. లేదంటే దర్శకుడు సెకండ్ పార్ట్ కి లీడ్ తీసుకునేలా క్లైమాక్స్ లో ఏదైనా ట్విస్ట్ అనేది ఉంటుంద ని అందరి లో ఆసక్తిగా మారింది .

అయితే దర్శకుడు శంకర్ కు పార్ట్ 2 లు కలిసి రాలేదు .. ఆయన దర్శకత్వం లో వచ్చిన రోబో 2 , భారతీయుడు 2 సినిమాలు శంకర్ కు భారీ షాక్ ను ఇచ్చాయి . ఇలాంటి సమయం లో గేమ్ చేంజర్ 2 పై  ఇలాంటి వార్తలు రావడం తో శంకర్ బుర్ర మారలేదా అంటూ కొందరు ఆయన పై కామెంట్లు చేస్తున్నారు . ఇక మరి గేమ్ ఛేంజర్ సినిమా శంకర్ కు తిరిగి కం బ్యాక్ ఇస్తుందో లేదు చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: