కన్నడ దర్శకుడికి చరణ్ గ్రీన్ సిగ్నల్.. రికార్డ్స్ బద్దలయ్యే మాస్ ఎంటర్టైనర్..?

Pulgam Srinivas
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చరణ్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక కొన్ని రోజుల క్రితమే చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ మూవీ ని మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ ఫుల్ స్ప్పెడ్ గా జరుగుతుంది.

ఈ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మూవీ చేయడానికి కమిట్ అయి ఉన్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే చరణ్ , సుకుమార్ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సుకుమార్ సినిమా తర్వాత మూవీ ని కూడా చరణ్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... కన్నడ సినిమా పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో నర్తన్ ఒకరు. ఈయన మఫ్టీ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి మంచి విజయాన్ని అందుకున్నాడు.

తాజాగా ఈ దర్శకుడు భైరతి రణగల్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితం విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే నర్తన్ తన తదుపరి మూవీ ని చరణ్ తో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు , మరికొన్ని రోజుల్లోనే చరణ్ కి కథను వినిపించనున్నట్లు , అన్ని ఓకే అయితే చరణ్ , నర్తన్ కాంబో లో మూవీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: