తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో సూర్య ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగు లో కూడా విడుదల అయ్యి కొన్ని మూవీ లు అందులో మంచి విజయాలను అందుకున్నాయి. దానితో సూర్య కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇది ఇలా ఉంటే తాజాగా సూర్య , శివ దర్శకత్వంలో కంగువ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరో గా నటించాడు.
భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంచనాలను అందుకోకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే సూర్య తన కెరియర్లో 44 వ సినిమాను కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే సూర్య తన కెరియర్లో 45 వ మూవీ ని ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... కొన్ని సంవత్సరాల క్రితం మాస్ మహారాజా రవితేజ హీరోగా కాజల్ అగర్వాల్ , తాప్సి హీరోయిన్ లుగా వీర అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే.
మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇకపోతే సూర్య , ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో చేయబోయే సినిమా వీర సినిమా కథకు చాలా దగ్గరగా ఉండబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంత వరకు నిజం అనేది తెలియాలి అంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.