కీర్తి సురేష్ ని ఆ సీనియర్ హీరో పెళ్లి చేసుకోవాలనుకున్నారా.. ముహూర్తం పెట్టించి మరీ..?

Pandrala Sravanthi
మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్న కీర్తి సురేష్ గురించి ఎన్నో ఆసక్తికర తెలియని విషయాలు సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే తాజాగా కీర్తి సురేష్ పెళ్లి వార్తలపై మరో న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. కీర్తి సురేష్ ని మొదట ఓ సీనియర్ హీరో పెళ్లి చేసుకోవాలనుకున్నారట. కానీ అది కుదరలేదని తెలుస్తోంది. మరి ఇంతకీ కీర్తి సురేష్ ని పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ సీనియర్ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.. కీర్తి సురేష్ కి ఇప్పటికే ఎంతోమంది హీరోలతో ఎఫైర్ వార్తలు వినిపించాయి. అలా నటుడు విజయ్ తో సినిమాలో చేసే సమయంలో  విజయ్ కి కీర్తి సురేష్ కి ఎఫైర్ ఉందని,ఆ ఎఫైర్ కారణంగానే విజయ్ తన భార్యకి దూరమయ్యాడని వార్తలు వచ్చాయి.

 అంతేకాకుండా ఓ ఫేమస్ జర్నలిస్టు శివ కార్తికేయన్ కి కీర్తి సురేష్ కి మధ్య అప్పట్లో ప్రేమాయణం నడిచిందని, కానీ శివ కార్తికేయన్ భార్యకి ఈ విషయం తెలియడంతో ఇంట్లో గొడవ జరిగి కీర్తి సురేష్ ని శివ కార్తికేయన్ దూరం పెట్టాడని కొన్ని వార్తలు వినిపించాయి.అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కూడా కీర్తి సురేష్ పెళ్ళంటూ కొన్ని రూమర్ చక్కర్లు కొట్టాయి. కానీ అందులో ఏది నిజం కాలేదు.అయితే తాజాగా కీర్తి సురేష్ గురించి మరో తెలియని విషయం చూద్దాం.అదేంటంటే.. కీర్తి సురేష్ ని సీనియర్ నటుడు విశాల్ పెళ్లి చేసుకోవాలనుకున్నారని అప్పట్లో ఓ వార్త కోలీవుడ్ లో వినిపించింది..

కీర్తి సురేష్ విశాల్ కాంబోలో సండకోజి-2  అనే సినిమా వచ్చింది.ఇది  తెలుగులో పందెంకోడి-2 గా రీమేక్ అయింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో కీర్తిసురేష్ ని ప్రేమించిన విశాల్ ఈ విషయం ఆమెకు చెప్పకుండానే నేరుగా ముహూర్తం ఫిక్స్ చేసుకొని కీర్తి సురేష్ ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పారట. అయితే అప్పటికే ఆంటోనీతో ప్రేమలో ఉన్న కీర్తి సురేష్ ఆ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కీర్తి సురేష్ తల్లిదండ్రులు పెళ్లి జరగదని చెప్పారట. దాంతో విశాల కీర్తి సురేష్ ని మర్చిపోయారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: