మెగా వర్సెస్ అల్లు వార్ : మధ్యలో అడ్డం ఇరుక్కుపోయిన స్టార్ డైరెక్టర్..!

Thota Jaya Madhuri
రెండు కంట్రీస్ కొట్టుకొని మిగతా కంట్రీ పై బాంబు వేసిందే.. అన్న లేటెస్ట్ సామెత అందరికీ తెలిసే ఉంటుంది.  ఇప్పుడు అలాగే తయారైంది డైరెక్టర్ బుచ్చిబాబు సనా పరిస్థితి . ఒకపక్క సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానం అందింది. మరొకపక్క మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమాను సెట్స్ పై తీసుకొచ్చాడు . అసలే మెగా వర్సెస్ అల్లు  వార్ ఎంత పీక్స్ కి చేరుకుంది అన్న విషయం అందరికి తెలిసిందే. 


ఈ టైంలో ఆహ్వానం అందిన ఈవెంట్ కి వెళ్లక పోతే ఒక ప్రాబ్లం.. వెళితే మరొక ప్రాబ్లం . ఒక్కవేళ్ల వెళ్ళకపోతే అల్లు ఫాన్స్ కి కోపానికి గురి అవ్వాలి. గురువుగారిని అవమానించారు అంటూ వార్తలు వచ్చేస్తాయి . పోని గురువు గారు అన్న భక్తి తో  వెళ్తే రామ్ చరణ్ హర్ట్ అవుతాడు . మెగా ఫ్యాన్స్ ఏ రేంజ్ లో అల్లాడించేస్తారో అందరికీ తెలిసిన విషయమే.  అయితే అలాంటి టఫ్ సిచువేషన్ సైతం ఇబ్బంది ఇబ్బందికరంగానే హ్యాండిల్ చేశాడు బుచ్చిబాబు సన.


మనకు తెలిసిందే సుకుమార్ శిష్యుడుగా బుచ్చిబాబు సనా "ఉప్పెన" సినిమాకి దర్శకత్వం వహించారు . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇప్పుడు రాంచరణ్ తో సినిమాను తెరకేక్కిస్తున్నారు . అయితే
ఇప్పుడు బుచ్చిబాబు సనాకు సంబంధించిన కొన్ని వార్తలు బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . బుచ్చిబాబు సనా తాజాగా పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిశారు . అయితే స్టేజి పైకి వచ్చిన బుచ్చిబాబు సన్న మొక్కుబడి మొక్కుబడిగానే మాట్లాడినట్టు తెలుస్తుంది.. గానీ ఎక్కడా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హార్ట్ ఫుల్ గా మాట్లాడిన సందర్భాలు కనిపించలేదు.  మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ అన్న పేరు కూడా ఎత్తకుండానే స్పీచ్ కంప్లీట్ చేసేసారు .అయితే సోషల్ మీడియా వేదికగా ట్రోల్ కి గురి చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . ఒకపక్క అల్లు ఫాన్స్ మరొకపక్క మెగా ఫాన్స్ మధ్య నలిగిపోయాడు బుచ్చిబాబు సనా అంటూ బాగా వార్తలు వైరల్ అవుతున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: