సమంత.. కాజల్ : ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా.. మరి ఇన్నా..?

Pulgam Srinivas
ఒక హీరో , హీరోయిన్ కాంబోలో చాలా సినిమాలు రావడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు. ఇప్పటివరకు తెలుగు సినీ పరిశ్రమలో ఒక హీరో , ఒక హీరోయిన్ కలిసి చాలా సినిమాలలో నటించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే సినిమాలో అనేక సార్లు నటించిన సందర్భాలు మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో చాలా తక్కువగా ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటీమణులలో కాజల్ అగర్వాల్ , సమంత ఉంటారు. వీరిద్దరూ కలిసి చాలా సినిమాలలో నటించారు. మరి వీరిద్దరూ నటించిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బృందావనం అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , సమంత హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం తమిళ నటుడు తలపతి విజయ్ , అట్లీ దర్శకత్వంలో మెర్సల్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూ వీలో కాజల్ అగర్వాల్ , సమంత హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. 

ఇక కొన్ని సంవత్సరాల క్రితం మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , సమంత హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ అనే మూవీ రూపొందింది. ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించగా కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇలా సమంత , కాజల్ కాంబోలో ఇప్పటివరకు నాలుగు సినిమాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: