షాక్: హత్య కేసులో ప్రముఖ నటి సోదరి.. షాక్ లో ఫ్యాన్స్..!
ఆలియా పై ఎన్నో ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఆమెను పోలీసులు సైతం అరెస్టు చేసినట్లుగా సమాచారం. ఆలియా తన మాజీ బాయ్ ఫ్రెండ్ ని సైతం హత్య చేయించిందని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమాచారం పోలీసులకు అందడంతో ఆలియాను పోలీసుల అరెస్టు చేశారట.. ఆలియా మాజీ ప్రియుడు ఎడ్వార్డ్ జాకబ్ తన స్నేహితుడైన ఎటియన్ తో కలిసి ఒక గ్యారేజీలో ఉన్నప్పుడు ఆలియా ఆ గ్యారేజ్ కి సైతం నిప్పు పెట్టిందని ఈ సంఘటన సమయంలో ఆలియా మాజీ ప్రియుడితో పాటు తన స్నేహితుడు కూడా మరణించారట.ఈ విషయం విని ఒకసారిగా అభిమానులు షాక్కు గురయ్యారు.
అయితే ఈ విషయంలో ఆలియాను అరెస్టు చేయగా ఆమెను క్విన్స్ క్రిమినల్ కోర్టులో సైతం హాజరు పరిచినట్లు సమాచారం. అయితే ఆమె బెయిల్ కోసం ప్రయత్నించిన అందుకోలేకపోయిందని సమాచారం. ఈ విషయం పైన పోలీసులు మాట్లాడుతూ నిందితరాలు ఉద్దేశపూర్వంగానే ఆ గ్యారేజ్ కి సైతం నిప్పు పెట్టిందని దీనివల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు ఈ విషయం పైన నర్గీస్ తల్లి మాట్లాడుతూ.. తన కూతురు అలాంటిది చేసి ఉండదని ఆమె అందరికీ సహాయం చేస్తుందని, అందరితో మంచిగానే ఉంటుందని వెల్లడించింది.. నర్గీస్ ఫక్రీ గత 13 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో ఉన్న ఈ అమ్మడు 2011లో రణబీరుతో కలిసి రాక్ స్టార్ అనే సినిమాలో నటించి భారీ పాపులారిటీ అందుకున్నది.