చరణ్ గేమ్ చేంజర్ రికార్డ్.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైమ్?
అయితే త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే.. మరో వైవిధ్యమైన దర్శకుడు శంకర్ తో ఒక సినిమా సైన్ చేసేసాడు రామ్ చరణ్. ఇక గేమ్ చెంజర్ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది అన్న విషయం తెలిసిందే. జనవరి 10వ తేదీన సంక్రాంతి బరిలో దిగి ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది గేమ్ చేంజర్ మూవీ. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తూ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. కాగా ఈ మూవీ గురించి ఏ విషయం తెర మీదికి వచ్చినా కూడా అది ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతోంది అని చెప్పాలి.
అయితే ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కమర్షియల్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు ఆ సినిమాలో ఫంక్షన్లు ఎలా ఎక్కడ చేస్తున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోతోంది. ఈ క్రమంలోనే అటు రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ మూవీ ఫ్రీ రిలీజ్ మూమెంట్ ని ఎక్కడ జరుపబోతున్నారు అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. అయితే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో ఏకంగా రామ్ చరణ్ ఒక రికార్డు కొట్టేశాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. ఏకంగా అమెరికాలోని డల్లాస్ లో ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది అని చిత్రం బృందం ఇటీవల వివరాలను వెల్లడించారు. ఈ నెల 21వ తేదీన సాయంత్రం 6 గంటలకు డల్లాస్ లో గ్రాండ్ గా ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నారట. అయితే ఒక ఇండియన్ సినిమా యూఎస్ఏ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విషయంలో చరణ్ రికార్డు కొట్టేశాడు.