పుష్ప-2 రిలీజ్ ని ఆపేస్తారా.. హైకోర్టు ఏం చెప్పిందంటే?
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు ట్రైలర్ అభిమానులు అందరిలో ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడుతూ ఇక ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీన పుష్ప 2 విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇలాంటి సమయంలో విడుదలను ఆపేయాలి అంటూ తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయింది అన్న విషయం తెలిసిందే. బెనిఫిట్ షో పేరుతో ఒక్కో టికెట్ కు 800 రూపాయలు వసూలు చేయడం అన్యాయమని. బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బును ఎక్కడికి మళ్ళిస్తున్నారో తెలియాల్సిన అవసరం ఉంది అంటూ సతీష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు.
అయితే ఈ విషయంపై ఇటీవలే విచారణ జరిపిన హైకోర్టు పుష్ప 2 చిత్ర యూనిట్ కి గుడ్ న్యూస్ చెప్పింది. చివరి నిమిషంలో సినిమా విడుదలను అడ్డుకోలేము అంటూ హైకోర్టు కామెంట్ చేసింది. దీంతో పుష్ప 2 సినిమా విడుదలకు క్లియరెన్స్ వచ్చేసింది. ఇక ఈ సినిమాను అనుకున్న విధంగానే రిలీజ్ చేసేందుకు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో బెనిఫిట్ షోల ద్వారా వచ్చే కలెక్షన్ల వివరాలను తమకు తెలియజేయాలంటూ నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవాలను సైతం పరిశీలిస్తాము అంటూ తెలిపింది.