వావ్: కవల పిల్లలకు తల్లైన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..!
దీంతో పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సైతం..శ్రద్ధా ఆర్య దంపతులకు సైతం కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నారు. పంజాబీ ప్రాంతానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ 2006లో కల్వనిక్ కాదలి అనే తమిళ సినిమా ద్వారా మొదటిసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా ఆర్య. ఆ తర్వాత హిందీలో పలు చిత్రాలలో నటించి మెప్పించింది.2007లో గొడవ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది.ఈ సినిమాలో ఈమె అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ అమ్మడు ఆ తర్వాత రోమియో, కోతిముక తదితర చిత్రాలలో కూడా నటించింది.
అయితే ఎందుకో కానీ ఈమె ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఎక్కడ కూడా కనిపించలేదు. పంజాబీ చిత్రాలలో కూడా నటించిన శ్రద్ధ.. 2021లో నేవీ ఆఫీసర్ రాహుల్ తో వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది.. వీరి దాంపత్యానికి గుర్తుగానే ఒక అబ్బాయి అమ్మాయి పుట్టారని విషయాన్ని అభిమానులతో పంచుకున్నది. ఈమె సినిమాలలోనే కాకుండా కుండలి భాగ్య, డ్రీమ్ గర్ల్ అంటే సీరియల్స్ లో కూడా బాలీవుడ్ లో నటించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారుతున్నది. ఒకేసారి డబుల్ బోనస్ కొట్టేసిన టాలీవుడ్ హీరోయిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు