టీమిండియా క్రికెటర్‌ తో దొరికిపోయిన దిశా..ఫోటోలు లీక్‌ ?

Veldandi Saikiran
బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటాని ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ బ్యూటీ ఇటీవలే రిలీజ్ అయిన కల్కి సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును దక్కించుకుంది. 2016 లో వచ్చిన ఎమ్మెస్ ధోని అన్ టోల్డ్ లవ్ స్టోరీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ చిన్నది ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

భాగీ, భారత్, మలంగ్ వంటి సినిమాలతో బాలీవుడ్ యంగ్ బ్యూటీ  దిశా పటాని క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖ్యంగా లోఫర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటాని ఇక్కడ అభిమానులను ఆకట్టుకుంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ బ్యూటీ రూట్ సపరేట్. సోషల్ మీడియా మాధ్యమాల్లో ఈ చిన్నది చాలా చురుగ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు వరుసగా ఫోటో షూట్లు చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.

ఇదిలా ఉండగా.... దిశా పటాని, హీరో టైగర్ ష్రాఫ్ మధ్య రిలేషన్ ఉన్నట్లుగా అనేక రకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. దానికి తగినట్టుగానే వీరిద్దరూ బయట కలిసి వీడియోలు చేయడం, వెకేషన్స్ కి వెళుతుండడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే గత కొన్ని రోజుల క్రితం వీరిద్దరూ విడిపోయారంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో ఇప్పటివరకు తెలియ రాలేదు.

అయితే తాజాగా దిశా పటాని టీమిండియా క్రికెటర్ బూమ్రా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బుమ్రా వివాహానికి ముందే దిశా పటానితో కలిసి రిలేషన్ కొనసాగించినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, రిలేషన్ కొనసాగించారని ఓ వార్తను వైరల్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ బాలీవుడ్ యంగ్ బ్యూటీ  దిశా పటాని... టీమిండియా క్రికెటర్ బూమ్రా తో చట్టా పట్టాలేసుకొని తిరిగిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: