ఎక్కడ చూసుకున్నా పుష్ప రాజ్ హవా కొనసాగుతోంది. ఈ సినిమాను థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరో రెండు రోజుల్లోనే థియేటర్లలోకి ఈ సినిమా రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను భారీగా నిర్వహించారు. తాజాగా హైదరాబాద్ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిన్న హైదరాబాదులో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. అల్లు అర్జున్, రష్మిక మందనపై ప్రశంసల వర్షం కురిపించారు.
స్టేజ్ మీద ప్రతి ఒక్కరు మాట్లాడుతూ సుకుమార్, అల్లు అర్జున్, రష్మికను మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఇందులో అల్లు అరవింద్ స్పీచ్ హైలైట్ గా నిలిచింది. ఈ ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ ఒక వారం రోజుల క్రితమే నేను పుష్ప2 సినిమాను చూశాను. సినిమా చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య నాతో మాట్లాడుతూ మొహం ఏంటి ఇంతలా వెలిగిపోతుంది అని నన్ను అడిగింది. ఇప్పుడే పుష్ప2 సినిమా చూసి వస్తున్నానని నేను చెప్పాను. దాంతో నా భార్య మీ మొహం ఇంతలా వెలిగిపోవడం నేను కేవలం రెండే రెండు సార్లు చూశాను.
ఒకటి మగధీర సినిమా సమయంలో, రెండవది ఇప్పుడు చూస్తున్నానని నా భార్య చెప్పింది అంటూ అల్లు అరవింద్ అన్నారు. మగధీర సినిమా అనంతరం మళ్లీ నేను ఇప్పుడే ఇంత సంతోషంగా ఉన్నాను. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి, సుకుమార్ భార్య భబితకు అవార్డులు అన్ని చేయాలి. ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు వారు సపోర్ట్ చేసినందుకు. ఇక ఈ సినిమాలో రష్మిక నటనతో పోల్చుకుంటే పుష్ప1 సినిమాలో చాలా తక్కువగా ఉందని చెప్పవచ్చు.
డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికీ మంచి ఇంపాక్ట్ చూపించిందని అల్లు అరవింద్ కొనియాడారు. ఇక అల్లు అరవింద్ స్పీచ్ విన్న రామ్ చరణ్ అభిమానులు కాస్త సీరియస్ అవుతున్నారు. మగధీర సినిమాను మించి పుష్ప2 సినిమా ఉందని ఇన్ డైరెక్ట్ గా అల్లు అరవింద్ స్పీచ్ ఇచ్చాడని కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మళ్లీ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.