అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం 'పుష్ప 2'. రష్మిక హీరోయిన్. డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు ఇప్పటికే ఫుల్ హైప్ క్రియేట్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా పుష్పరాజ్ రాకకోసం ఎదురుచూస్తోంది. అయితే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 12 వేల కన్నా ఎక్కువ థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్ అదే జరిగితే. బాహుబలిని బ్రేక్ చేయడమే అంటున్నారు సినీ పండితులు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమా బాహుబలి మాత్రమే. డార్లింగ్ హీరో ప్రభాస్ నటించిన ఈ సినిమా 9వేల థియేటర్లలో రిలీజైంది. ఈ నేపథ్యంలో నే బాహుబలి2 మూవీ 1800 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుని 5 సంవత్సరాలు కాగా ఇప్పటికీ ఆ సినిమా కలెక్షన్ల రికార్డులు బ్రేక్ కాలేదనే సంగతి తెలిసిందే. బాహుబలి2 కలెక్షన్లను బ్రేక్ చేయడం పుష్ప2 కు సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో విడుదలకు ముందే పుష్ప2 సంచలనాలు నమోదు చేస్తుంది ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో లో అత్యంత వేగంగా 10 లక్షల టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా నిలిచినట్లు సినీవర్గాలు తెలిపాయి.
కల్కి ,బాహుబలి 2 ,కేజీఎఫ్ 2 రికార్డులను చెరిపేసిందని పేర్కొన్నాయి .మరోవైపు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా రూ.100 కోట్ల మార్క్ క్రాస్ అయిందని భారత సినీ చరిత్రలో ఇదే రికార్డు అని పుష్ప టీం పోస్ట్ చేసింది.ఇదిలావుండగా పుష్ప ది రూల్ మూవీ హిట్టైతే ఈ సినిమా సీక్వెల్ పై కూడా అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. బన్నీ రేంజ్ ను డిసైడ్ చేసే మూవీ పుష్ప ది రూల్ అని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు. పుష్ప1 బాక్సాఫీస్ వద్ద, యూట్యూబ్ లో పలు క్రేజీ రికార్డులను సొంతం చేసుకుంది. పుష్ప ది రూల్ సైతం సరికొత్త రికార్డ్స్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి. అల్లు అర్జున్ కు ప్రస్తుతం పరిస్థితులు సైతం అనుకూలంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపుగా 90 శాతం థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. రికార్డ్ స్థాయిలో రిలీజ్ దక్కడం ఈ సినిమాకు ప్లస్ కానుంది. పుష్ప ది రూల్ బాక్సాఫీస్ ను సైతం రూల్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.