ఎక్కడ చూసినా పుష్పరాజ్ ఫీవర్.. బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ కావడం ఖాయమా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పుష్ప ది రూల్ సినిమాతో ఎన్నో రెట్లు పెరగడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నార్త్ సౌత్ మాత్రమే కాదు దేశ విదేశాల్లో ప్రస్తుతం బన్నీ నామస్మరణ మాత్రమే వినిపిస్తోంది. బాక్సాఫీస్ ను బన్నీ రూల్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో మ్యాజిక్ చేస్తారో అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.
పుష్ప ది రూల్ కు బాక్సాఫీస్ వద్ద పరిస్థితులు సైతం అనుకూలంగా ఉన్నాయి. ఒకవైపు చలి ఎక్కువగా ఉన్నా బన్నీ అభిమానులు థియేటర్లలో ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. పుష్ప ది రూల్ రిలీజ్ తో బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ కావడం ఖాయమని బాహుబలి2 రికార్డులను పుష్ప2 బ్రేక్ చేయడం పక్కా అని తెలుస్తోంది.
బన్నీ ఫ్యాన్స్ సైతం పుష్ప ది రూల్ ఫీవర్ తో ఉన్నారు. పుష్ప ది రూల్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పుష్ప ది రూల్ ఫస్ట్ డే కలెక్షన్లకు సంబంధించి వేర్వేరు అంచనాలు వైరల్ అవుతున్నాయి. బన్నీ ఈ సినిమాతో మరో మెట్టు పైకి ఎదిగాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.