నందమూరి నటసింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం ప్రారంభంలో వీర సింహా రెడ్డి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదిరిపోయే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక పోయిన సంవత్సరం ప్రారంభంలో వీర సింహా రెడ్డి మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య ఆ తర్వాత పోయిన సంవత్సరం భగవంత్ కేసరి అనే మరో మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
ఇకపోతే భగవంత్ కేసరి సినిమా తర్వాత బాలయ్య , బాబి దర్శకత్వంలో NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ ని మొదలు పెట్టాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇక గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ చాలా పెండింగ్లో ఉంది అని , ఈ సినిమా సంక్రాంతికి రావడం కాస్త కష్టమే అనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి సమయంలో బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చింది. అదేమిటి అంటే డాకు మహారాజ్ మూవీ కి సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టి ఈ మూవీ ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల చేసే విధంగా అన్ని పనులను మేకర్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.