అనుష్క తర్వాత అలా చేసిన ఏకైక హీరోయిన్ రష్మిక మందన్నా మాత్రమే..మోస్ట్ స్పెషల్ రేర్ రికార్డ్..!
పుష్పవన్ కి ముందు రష్మిక మందన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్ ఫాలోయింగ్ పూర్తిగా మారిపోయింది. రష్మిక మందన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ పుష్ప 2 రిలీజ్ అవ్వబోతున్న వేళ మరింత గా మారిపోయింది. రష్మిక మందన్నా ఫ్యాన్స్ స్టేటస్ ఫాలోయింగ్ కళ్ళు చెదిరే రేంజ్ లో పెరిగిపోయింది అని చెప్పాలి . అయితే రష్మిక మందన్నా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే చాలా చాలా రేర్ రికార్డ్స్ అచివ్ చేసింది . మరీ ముఖ్యంగా బాహుబలి సినిమా కోసం అనుష్క ఎంత కష్టపడిందో ..అంతకు డబల్ స్థాయిలోనే రష్మిక మందన్నా పుష్ప సినిమా కోసం కష్టపడింది అంటూ జనాలు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.
బాహుబలి 1 బాహుబలి 2 సినిమా కోసం అనుష్క చాలా స్థాయిలో కష్టపడింది . దాదాపు కొన్ని ఏళ్ళు అలాగే కమిట్మెంట్ ఇస్తూ రాజమౌళితో వర్క్ చేసింది . అయితే రష్మిక మందన్నా సైతం అదే విధంగా పుష్ప సినిమాకి వర్క్ చేసింది . ఆ విషయాన్ని ఓపెన్ గా స్టేజిపై బయటపెట్టారు సుకుమార్. అల్లు అర్జున్ రాత్రి రెండు గంటల వరకు షూటింగ్ ఉన్న సరే ఉదయం 8:30 కల్లా సెట్ లో ఉండేది అని .. ఈ సినిమాకు రష్మిక మందన్నా పెట్టిన ఎఫర్ట్ ఎప్పటికీ మర్చిపోలేమంటూ పొగిడేసారు. మరి ముఖ్యంగా పుష్ప1 పుష్ప2 ఈ సిరీస్ కోసం రష్మిక మందన్నా పడిన కష్టం మరి ఏ హీరోయిన్ కూడా పడి ఉండదు అంటూ పొగిడేస్తున్నారు . బాహుబలి సినిమా కోసం అనుష్క పడిన కష్టానికి డబల్ స్థాయిలో పుష్ప సినిమా కోసం రష్మిక మందన్నా పడింది అంటూ ఈ సినిమాలో సక్సెస్ ఆమెకి సగం వాటా ఇవ్వాలి అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు..!