పుష్పరాజ్ ... మెగా ఫ్యామిలీకి అక్కడ చోటు లేదు బ్రదర్ .. !

Amruth kumar
అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. భారతీయ సినిమా మొత్తం కూడా పుష్ప2 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. ఫ్యాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి పుష్ప2కు పబ్లిసిటీ కూడా చేశారు .. ఇక గత సోమవారం హైదరాబాదులో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్గా జరిగింది. అయితే ఇప్పుడు అల్లు ఫ్యామిలీకి చెందిన ఒక కటౌట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది .. ఓ సినిమా ధియేటర్ వద్ద అభిమానులు అల్లు ఫ్యామిలీ మొత్తాన్ని కటౌట్ తో ఏర్పాటు చేశారు .. ఇక ఇందులో అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ , అల్లు బాబీ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ .. చివరకు అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్‌ కూడా ఇందులో ఉండటండటం విశేషం .

ఓ థియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ కటౌట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది .. అయితే ఈ ఫ్లెక్స్ లో ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఎక్కడ కనిపించారు.మెగా - అల్లు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే .. ఇక గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు .. వైసిపి అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి నంద్యాల వెళ్లి మరి తన మద్దతు ఇచ్చారు బన్నీ.. ఇక మెగా కుటుంబం అంతా కూడా పవన్ కళ్యాణ్ కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసిపి అభ్యర్థికి తన మద్దతు ఇవ్వటం .. బన్నీ సపోర్ట్ ఇచ్చిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ను ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు.

ఇక ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్యూ ఫ్యామిలీ అన్నట్టుగా మొత్తం సీను  మారిపోయింది. ఇక పుష్ప2 ప్రమోషన్స్లో అల్లు అర్జున్ కూడా ఎక్కడ మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు ..  ఇక గతంలో ప‌లు ఈవెంట్లో మెగా అభిమానులు అంటూ మాట్లాడిన అల్లు అర్జున్ ఇప్పుడు మాత్రం మై ఫాన్స్ , మై ఆర్మీ అని మాత్రమే మాట్లాడుతూ వచ్చారు .. ఇక దీని కారణంగానే అల్లు అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మెగా హీరోలకు చోటు ఇవ్వలేదని కూడా  అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: