సంక్రాంతికి వస్తున్నాం : క్రేజ్ మామూలుగా లేదుగా.. ఆ ఫ్లాట్ ఫామ్లో ఫుల్ జోష్..?

Pulgam Srinivas
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ... బీమ్స్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
 

గతంలో విక్టరీ వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబోలో ఎఫ్ 2 , ఎఫ్ 3 అనే సినిమాలు వచ్చాయి. ఇందులో ఎఫ్ 2 మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా ఎఫ్ 3 మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇక వీరి కాంబోలో రూపొందిన రెండు సినిమాలు మంచి విజయాలను అందుకొని ఉండడంతో ప్రస్తుతం వెంకటేష్ , అనిల్ రావిపూడి కాంబోలో పొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాకు బుక్ మై షో ఆప్ లో మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీకి ఇప్పటికే బుక్ మై షో లో 50 కే ప్లస్ ఇంట్రెస్ట్ లు లభించాయి.

ఇలా విడుదలకు చాలా రోజుల ముందే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు బుక్ మై షో లో జనాల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే వెంకటేష్ ఆఖరుగా సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: