కన్నడ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి రిషబ్ శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో కన్నడ సినిమాలలో హీరోగా నటించి ఎన్నో విజయాలను అందుకొని కన్నడ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం ఈయన కాంతారా అనే సినిమాలో హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఆ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ మొదట కన్నడ లో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సాధించింది.
ఆ తర్వాత కొంత కాలానికి ఈ మూవీ ని మరికొన్ని భాషలలో విడుదల చేయగా ఈ మూవీ దాదాపు విడుదల అయిన ప్రతి భాషలో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇకపోతే కాంతారా సినిమా తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం రిషబ్ శెట్టి నాలుగు సినిమాలకు లైన్ లో పెట్టాడు. ఆ నాలుగు సినిమాలలో రెండు తెలుగు సినిమాలే కావడం విశేషం. రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ అనే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీలతో పాటు చత్రపతి శివాజీ మహారాజ్ అనే టైటిల్ తో రూపొందబోయే మరో సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఇలా నాలుగు సినిమాలను సెట్ చేసుకున్న రిషబ్ శెట్టి అందులో రెండు తెలుగు సినిమాల్లో నటించబోతున్నాడు. ఇలా రిషబ్ శెట్టి అదిరిపోయే రేంజ్ లైనప్ ను సెట్ చేసి పెట్టుకున్నాడు.