ఎన్టీఆర్ - అల్లు అర్జున్ ఇద్దరి రూట్ ఒకటేనా .. అప్పుడు దేవర ఇప్పుడు పుష్ప 2 బాక్సాఫీస్ బ్లాస్ట్ ..!
అల్లు అర్జున్ - ఎన్టీఆర్ ఇద్దరూ సొంతంగా తమకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు . అలా సినిమా సినిమాకి తమ రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నా ఈ ఇద్దరు పై సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే నెగిటివిటి కనిపిస్తుంది .. ఈ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు విపరీతంగా ట్రోల్స్ చేస్తారు .. కావాలని సినిమాల మీద తప్పుడు వార్తను ప్రచారం చేస్తారు .. ఇలాంటి విషయాల్లో ఎన్టీఆర్ - బన్నీ ఇద్దరు ఒక విధమైన ప్రాబ్లంను ఎదుర్కొంటున్నారు. ఎంతో పెద్ద సినీ బ్యాగ్రౌండ్‌తో వచ్చి .. అనుకోని సంఘటనలతో ఫ్యామిలీ హీరోల పేర్లను ప్రస్తావించకపోవడం కారణంగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ , అల్లు అర్జున్ పై నెగిటివిటీ వస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు .. నందమూరి ఫ్యామిలీలో బాబాయ్ బాలకృష్ణ , అబ్బాయ్ ఎన్టీఆర్ ల మధ్య దూరం పెరిగినట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వాటికి తగ్గట్టుగానే వీరిద్దరూ గద్దర్ కొన్నాళ్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో వీరిద్దరూ ఒకే వేదికను పంచుకున్న సందర్భాలు కూడా ఎక్కడా లేవు. సినిమా ఫంక్షన్లో తన తాతను తలుచుకున్న ఎన్టీఆర్ బాలయ్య పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించడం లేదు. దీంతో ఓ వర్గం ఎన్టీఆర్ ని టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
ఇక మరోవైపు మెగా అల్లు కుటుంబాల మధ్య కూడా అంతా సవ్యంగా లేదని పుకార్లు కూడా కొన్నాళ్లుగా వస్తున్నాయి .. అల్లు అర్జున్ గతంలో ఈవెంట్లో...
'చెప్పను బ్రదర్' అంటూ పవన్ కళ్యాణ్ పేరును చెప్పకపోవడంపై మెగా ఫ్యాన్స్ ఎంత రచ్చ చేశారో మనం చూశాం. అప్పటి నుండి ఇరు వర్గాల మధ్య ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. ఏపీ ఎన్నికల సమయంలో బన్నీ నంద్యాల వెళ్లి తన ఫ్రెండ్ ను కలిసి వచ్చిన తర్వాత, మెగా ఫ్యామిలీ సభ్యులు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అల్లు అర్జున్ మీద సోషల్ మీడియాలో ఎంతటి ట్రోలింగ్ జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. అది సినిమాలను బహిష్కరించాలని పోస్టులు పెట్టే వరకూ వచ్చింది. ఎన్టీఆర్ , అల్లు అర్జున్ మాత్రం ఇలాంటి నెగెటివిటీని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు .. తమ సక్సెస్ తో అందరికీ గట్టి సమాధానం ఇస్తున్నారు .. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమాతో తన స్టార్డం ఏంటో చూపించాడు .. ఇక పుష్ప వన్ సినిమాతో పాన్ ఇండియా సక్సెస్ సాధించిన బన్నీ .. ఇప్పుడు పుష్ప 2తో బాక్సాఫీస్ ను మరోసారి రూల్ చేయడానికి రెడీ అవుతున్నారు.