అన్ స్టాపబుల్4 ఫ్లాప్ కు కారణాలివేనా.. బాలయ్య విషయంలో విమర్శలా?

Reddy P Rajasekhar
అన్ స్టాపబుల్ షో సీజన్4 ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ షోకు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ వస్తుందా అనే ప్రశ్నకు కాదనే సమాధానం వినిపిస్తోంది. మరీ పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు ఈ షోకు గెస్ట్ లుగా హాజరు కావడం లేదు. అదే సమయంలో చిరంజీవి, చరణ్, తారక్, నాగార్జున, కళ్యాణ్ రామ్, మరి కొందరు ప్రముఖ సెలబ్రిటీలు ఈ షోకు దూరంగా ఉండటం గమనార్హం.
 
అన్ స్టాపబుల్ సీజన్4 లో బాలయ్య సైతం ఆర్టిఫిషియల్ గా కనిపిస్తున్నారని మరి కొందరు అభిప్రాయపడుతున్నరు. బాలయ్య విషయంలో వస్తున్న విమర్శలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. బాలయ్య ఇతర సెలబ్రిటీలను మెచ్చుకుంటూ చేస్తున్న కొన్ని కామెంట్ల విషయంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య స్థాయి వేరని ప్రేక్షకుల విషయంలో ఆయన స్థానం వేరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
అన్ స్టాపబుల్ సీజన్4 మిగతా ఎపిసోడ్లకు సంబంధించి గెస్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్ స్టాపబుల్4 కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని ఫ్యాన్స్ భావించినా అందుకు భిన్నంగా జరిగింది. గతంలో పలువురు సెలబ్రిటీలు హాజరు కాగా యాప్ క్రాష్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటి పరిస్థితులు చోటు చేసుకోలేదు.
 
బాలయ్య తన షోల కోసం కష్టపడుతున్న తీరుకు సైతం ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అన్ స్టాపబుల్ సీజన్4 కోసం బాలయ్య ఒకింత ఎక్కువ మొత్తం ఛార్జ్ చేశారని తెలుస్తోంది. అన్ స్టాపబుల్4 ఆహా ఓటీటీకి కొంతమేర ప్లస్ అయిందని మాత్రం కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అన్ స్టాపబుల్4 రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. బాలయ్య కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని విజయాలను అందుకుంటరేమో చూడాలి. డాకు మహారాజ్ మూవీ టికెట్ రేట్లు భారీ రేంజ్ లో ఉండబోతున్నాయని సమాచారం అందుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: