మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి చాలా కాలం నుండి కేవలం విశ్వంభర సినిమాపై మాత్రమే ఫోకస్ పెట్టాడు. కానీ తన తదుపరి మూవీ కి సంబంధించిన ఎలాంటి అప్డేట్లను విడుదల చేయలేదు. దానితో మెగా ఫాన్స్ చిరు ఎందుకు కేవలం ఒకే సినిమాపై ఫోకస్ పెట్టాడు. మరో మూవీ ని ఓకే చేసి మొదలు పెడితే బాగుంటుంది అనే అభిప్రాయాలు కూడా బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
ఇకపోతే చిరంజీవి ఏకంగా ఒకే సారి మూడు మూవీలను ఓకే చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... మెగాస్టార్ చిరంజీవి , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాను నాచురల్ స్టార్ నాని నిర్మించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి ఓ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి సందీప్ రెడ్డి వంగా కూడా చిరుతో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా చిరంజీవి కి సందీప్ ఓ కథను వినిపించగా ఆ కథ అద్భుతంగా నచ్చడంతో చిరు , సందీప్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ఇంత కాలం సైలెంట్ గా ఉన్న చిరు ఒకే సారి ముగ్గురు దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా చిరు ఒకే సారి ముగ్గురు క్రేజీ డైరెక్టర్లతో మూవీలను ఓకే చేసినట్లు వార్తలు రావడంతో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.