తెలుగు లో అత్యంత ఎక్కువ కాలం యాంకర్ గా కెరియర్ ను కొనసాగించిన వారిలో ఝాన్సీ ఒకరు. ఈమె యాంకర్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని , ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుంది. కొంత కాలం క్రితం ఝాన్సీ ఓ వైపు వరుస టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఝాన్సీ ఎక్కువ శాతం టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం లేదు. కానీ సినిమాలలో మాత్రం పరవాలేదు అనే స్థాయిలో అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను మంచి స్థాయి లోనే ముందుకు సాగిస్తుంది.
ఇది ఇలా ఉంటే ఝాన్సీ కి 22 ఏళ్ళ కూతురు ఉంది అన్న విషయం చాలా మంది కి తెలియదు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఝాన్సీ తన కూతురుకి సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన కూతురు ధాన్య ను జనాలకు పరిచయం చేసింది. ఇక ధాన్య కూడా సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే ఝాన్సీ తన కూతురుని సినిమా ఇండస్ట్రీ కి పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.
మరి కొన్ని రోజుల్లోనే ఝాన్సీ కూతురు ధాన్య సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఉండబోయే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతుంది. మరి దాన్య ప్రస్తుతం సోషల్ మీడియాలో తన అందాలతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. దానితో ఈ ముద్దు గుమ్మకు సినిమా ఇండస్ట్రీ లో అవకాశాలు ఈజీగా దక్కే అవకాశం ఉంది అని , ఇక ఈమె నటించిన సినిమాలు మంచి విజయాలను సాధిస్తే ఈమె మంచి హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని కొంత మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.