బాహుబలి కాదు.. మెగా బలి.. పుష్ప-2పై RGV పోస్ట్ వైరల్?
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు ట్రైలర్ అభిమానులు అందరిలో కూడా భారీగా అంచనాలను పెంచేశాయి. ఇక మరోసారి అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేయబోతున్నాడు అంటూ అభిమానులు అందరూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు అన్న విషయం తెలిసిందే ఇక రేపు ప్రీమియర్ షోలు ఎప్పుడు పడతాయో అని ఇక వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో పుష్ప-2 సినిమా విడుదలను వాయిదా వేయాలి అంటూ కొంతమంది ఏకంగా హైకోర్టు మెట్లు ఎక్కుతూ ఉండటం అభిమానులను ఆందోళన కలిగిస్తుంది.
ఇదిలా ఉంటే రేపు భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న పుష్ప-2 సినిమాకు సంబంధించి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పెట్టిన పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఎప్పుడు తన పోస్టులతో సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టించే దర్శకుడు వర్మ ఇప్పుడు మరోసారి అటు పుష్ప -2 కి వస్తున్న క్రేజ్ పై సెటైరికల్ పోస్ట్ పెట్టారు. పుష్ప-2 సినిమాకు వస్తున్న మెగా క్రేజ్ చూస్తూ ఉంటే తదుపరి మెగా అల్లునే.. బన్నీ మీరు బాహుబలి కాదు కానీ స్టార్స్ లో 'మెగా బలి ' అంటూ రాంగోపాల్ వర్మ పోస్ట్ చేశారు. అయితే ఇక ఈ పోస్ట్ కి ఆయన దర్శకత్వం లో తెరకెక్కుతున్న శారీ అనే మూవీ పోస్టర్ ని కూడా యాడ్ చేశారు. కాగా ఈ పోస్ట్ వైరల్ గా మారగా ఈ పోస్ట్ అర్థమేంటో అన్న విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు.