ఫ్రీ సేల్స్ తోనే 100 ప్లస్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టిన ఇండియన్ సినిమాలు ఏవి .? అందులో పుష్ప పార్ట్ 2 మూవీ ఏ స్థానంలో నిలిచింది అనే వివరాలను తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి 2 సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొట్ట మొదటి సారి ఫ్రీ సేల్స్ తో 100 ప్లస్ కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రీ సెల్స్ తో 100 ప్లస్ కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ 100 ప్లస్ కోట్ల కలెక్షన్లను ప్రీ సేల్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది.
తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన లియో మూవీ ప్రీ సేల్స్ తోనే 100 ప్లస్ కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా ప్రీ సేల్స్ తోనే 100 ప్లస్ కోట్ల కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని రేపు అనగా డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రీ సేల్స్ తో ఇప్పటికే 100 ప్లస్ కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇండియా వ్యాప్తంగా ప్రీ సేల్స్ తో 100 ప్లస్ కోట్ల కలెక్షన్లను రాబట్టిన సినిమాలలో పుష్ప పార్ట్ 2 మూవీ 6 వ స్థానంలో నిలిచింది.