బిగ్ షాకింగ్: మళ్లీ హాస్పిటల్ మెట్లు ఎక్కబోతున్న ప్రభాస్..ఈసారి ఎందుకంటే..?

Thota Jaya Madhuri
ఇది నిజంగా రెబెల్ అభిమానులకి హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి . ఇన్నాళ్లు రెబెల్ స్టార్ ప్రభాస్ ఫుల్ పాన్ ఇండియా సినిమాల షూట్ తో  బిజీ బిజీగా ఉన్నాడు అని ..త్వరలోనే మంచి మంచి సినిమాలు అనౌన్స్మెంట్ రాబోతుంది అని ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన విషయం కూడా బయట పెట్టబోతున్నాడు అని ..చాలా చాలా ఊహించుకున్నారు మాట్లాడుకున్నారు ఆయన ఫ్యాన్స్.  అయితే సడన్ గా ఏమైందో ఏమో తెలియదు కానీ ప్రభాస్ హాస్పిటల్ లో అడ్మిట్ కాబోతున్నాడు అన్న వార్త రెబల్ అభిమానులకి టెన్షన్ పెట్టేలా చేస్తుంది.

 
మనకు తెలిసిందే రాధే శ్యామ్ సినిమా షూటింగ్ టైం నుంచి ప్రభాస్ కాళ్లకి సర్జరీలు జరుగుతూ వస్తున్నాయి . అయితే మళ్లీ ప్రభాస్ మోకాల గాయం తిరగబడిందట . కొన్నాళ్లపాటు రెస్ట్ తీసుకోవాలి అంటూ డాక్టర్ సజెషన్స్ చేస్తున్నారట . మరొక చిన్న మైనర్ సర్జరీ కూడా ఉంది అంటూ డాక్టర్స్ వెంటనే చేయించుకోవాలి అని సజెస్ట్ చేస్తున్నారట . ఈ కారణంగానే ప్రభాస్ మళ్ళీ విదేశాలకు వెళ్లి తన మోకాళ్ళకి మైనర్ సర్జరీ చేయించుకోబోతున్నారట . ఆ తర్వాత బెడ్ రెస్ట్ కూడా తీసుకోబోతున్నారట . దీంతో ప్రభాస్ కమిట్ అయిన సినిమాలు హోల్డ్ లో పెట్టే పరిస్థితి వచ్చింది.

 
అంతేకాదు రెబల్ అభిమానులు ఫుల్ డిలా పడిపోతున్నారు . అయితే కొంతమంది మాత్రం రెబెల్ ఫాన్స్ బన్నీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేవరకు ఏది నమ్మకూడదు అంటూ సజెస్ట్ చేస్తున్నారు . ఈ మధ్యకాలంలో ప్రభాస్ పేరుపై రకరకాల వార్తలు వైరల్ అవుతూ ట్రెండ్ అవుతాయి అని .. ఇది కూడా అలాంటి ఓ గాలికి పుట్టిన వార్త నే అని రెబెల్ అభిమానులు టెన్షన్ పడొద్దు అని ప్రభాస్ నుంచి ఏదైనా అఫిషియల్  అప్డేట్ వచ్చేవరకు మనం ఏది టెన్షన్ పడే విధంగా తీసుకోకూడదు అంటూ సజెస్ట్ చేస్తున్నారు . ఇది గాలికి పుట్టిన గాలి వార్తా..? లేకపోతే నిజంగానే నిజమైన వార్త..? తెలియాలి అంటే రెబల్ అభిమానుల కోరిక మేరకు ప్రభాస్ స్పందించాల్సిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: