ఇది కదా కిక్కిచ్చే న్యూస్.. పవన్ మూవీకి పార్ట్-2?
అవును, పవన్ డేట్స్ ని బట్టి ఈ సినిమా షూట్ జరుగుతుండటంతో నిధి వేరే సినిమాలను కూడా వదిలేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లతో ముచ్చటించిన హీరోయిన్ నిధి చాలా ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ హరిహర వీరమల్లు సినిమాలో ఏదైనా లవ్ ట్రాక్ ఉందా అని అడగ్గా వీర, పంచమిల మధ్య బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది అని చెప్పుకొచ్చింది. అక్కడితో ఆగకుండా, ఈ సినిమా గురించి మరో రహస్యం చెప్పుకొచ్చింది. విషయం ఏమిటంటే, ఈ సినిమా రెండు పార్టులతో రాబోతోందని. అయితే మొదటి పార్టులాగా కాకుండా రెండవ పార్ట్ చాలా త్వరగా రిలీజ్ కాబోతోందని చెప్పుకొచ్చింది.
దాంతో, పవర్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంకా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నల్లో పంచమి పాత్రను బాగా రాసారని, ఎవరూ ఊహించలేని పాత్ర అని చెప్పుకు రావడం విశేషం. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గురించి ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించింది. అలాగే నిన్న షూటింగ్ లో పవన్ కళ్యాణ్ తో సెల్ఫీ తీసుకున్నాను అని త్వరలోనే ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను అని కూడా ఆమె తెలిపింది. దీంతో నిధి కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక హరిహర వీరమల్లు సినిమా మార్చ్ 28న రిలీజ్ కాబోతున్న విషయం విదితమే.