పుష్ప-2 : పీలింగ్స్ పాటపై.. రామ్ చరణ్ డాన్స్.. వైరల్ వీడియో?
దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలలో 11 వేలకు పైగా థియేటర్లలో ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయిన పుష్ప 2 గర్జనతో ప్రస్తుతం థియేటర్లో దద్దరిల్లిపోతున్నాయి. పుష్పరాజ్ నట విశ్వరూపానికి అటు ప్రేక్షకులు అందరూ కూడా ఫిదా అయిపోతున్నారు. ఇక ఈ సినిమాలోని పాటలు కూడా ఇప్పటికే అటు యూట్యూబ్లో సెన్సేషన్ సృష్టించాయి అన్న విషయం తెలిసిందే. అయితే సినిమా విడుదలకు కొన్ని రోజులు ముందు రిలీజ్ అయిన ఫీలింగ్స్ అనే సాంగ్ ఎంతలా సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా కాలం తర్వాత అభిమానులు అల్లు అర్జున్ సూపర్ డాన్స్ పర్ఫామెన్స్ ని చూశారు. ఇక ఈ పాటలో అల్లు అర్జున్ గ్రేస్ ని మ్యాచ్ చేస్తూ రష్మిక మందన్న తన డాన్సులతో కూడా ఇరగదీసేసింది.
దీంతో ఈ పాటపై ఎంతోమంది అభిమానులు కూడా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కాగా అల్లు అర్జున్ డాన్స్ తో ఇరగదీసిన ఫీలింగ్స్ అనే పాటపై ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. అయినా ఈ పాటపై రామ్ చరణ్ ఎందుకు డాన్స్ చేస్తాడు అనుకుంటున్నారు కదా. కానీ ఇటీవలే మెగా పవర్ స్టార్ కూడా ఫీలింగ్స్ పాటపై డాన్స్ చేసి అదిరిపోయే స్టెప్పులు వేశారు. అదేంటి రామ్ చరణ్ నిజంగా డాన్స్ చేశాడా అని ఆశ్చర్యపోతున్నారు కదా. నిజంగా డాన్స్ చేయలేదు. కానీ ఒక అభిమాని ఎడిటెడ్ వీడియోని క్రియేట్ చేశాడు. అటు చరణ్ నటించిన సినిమాలోని ఒక పాటలోని డాన్స్ క్లిప్ ని ఎడిట్ చేసి అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాలోని ఫీలింగ్స్ పాటను ఆ డాన్స్ కి యాడ్ చేశాడు. సరిగా ఆ పాట బీట్ కి తగ్గట్లుగా నిజంగానే రామ్ చరణ్ డాన్స్ చేశాడేమో అన్నట్లుగా ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.