పుష్ప-2 : అక్కడ మిడ్ నైట్ షోలు రద్దు.. కోపంతో ఊగిపోయిన ఫ్యాన్స్?

praveen
స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు అటు థియేటర్ల వద్ద ఉండే హడావిడి అంత ఇంత కాదు. ఒకరకంగా పండగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఏకంగా థియేటర్ల వద్ద అటు స్టార్ హీరోలకు సంబంధించిన భారీ కటౌట్లు వెలుస్తూ ఉంటాయి. ఇక ఆ కటౌట్లకు పూలదండలు వేసి పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు అభిమానులు. బ్యాండ్ బాజాతో ఇక సినిమా రిలీజ్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇండియాలోని ఏ సినిమా థియేటర్ వద్ద చూసిన కూడా ఇలాంటి హడావిడి నెలకొంది.


 ఎందుకంటే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాకు సీక్వల్ గా తెరకెక్కిన పుష్ప 2 సినిమా ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఏకంగా 50 దేశాలలో 11 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీని చూసేందుకు అటు సినీ లవర్స్ అందరూ ప్రేక్షకులకు బారులు తీరుతూ ఉన్నారు. అయితే అభిమానులు సాధారణంగా సినిమాను చూడటం చేస్తూ ఉంటారు. కానీ వీరాభిమానులు అందరికంటే ముందే తమ అభిమాన హీరో సినిమాను చూసి మంత్రముగ్ధులు కావాలని అనుకుంటూ ఉంటారు. ఇక అందుకే కాస్త హడావిడి ఎక్కువగా ఉంటుంది అని తెలిసినప్పటికీ అటు బెనిఫిట్ షోలకు వెళ్లడానికి సిద్ధపడిపోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇప్పటికే అన్నిచోట్ల అభిమానులు అందరూ బెనిఫిట్ షోలు చూసేశారు. కానీ ఒక్కచోట మాత్రం పుష్ప 2 బెనిఫిట్ షో లు చూడాలి అనుకున్న అభిమానులకు నిరాశ ఎదురయింది. ఏకంగా కర్ణాటకలో పుష్ప 2 ఫాన్స్ కి షాక్ తగిలింది. బెంగళూరులో పుష్ప 2 మూవీ మిడ్ నైట్, ఎర్లీ మార్నింగ్ షోలు ప్రదర్శించవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటలకు ముందు షోలు ప్రదర్శించడం చట్ట విరుద్ధం అంటూ కన్నడ ఫిలిం ప్రొడ్యూసర్ల ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే షోలు వేసేందుకు పలుచోట్ల మూవీ యూనిట్ ఏర్పాట్లు చేసింది. అభిమానులు కూడా పుష్ప-2 మూవీని అందరికంటే ముందే చూసేయడానికి సిద్ధమయ్యారు. కానీ కలెక్టర్ ఆదేశాలతో అందరికీ నిరాశ ఎదురైంది..దీంతో ఇక కలెక్టర్ తీసుకున్న నిర్ణయం పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే తెగ కోపంతో ఊగిపోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: