తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన కాంబినేషన్లో అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ ఒకటి. వీరి కాంబోలో మొదటగా ఆర్య అనే మూవీ వచ్చింది. ఈ సినిమా అల్లు అర్జున్ కెరియర్ లో రెండవ సినిమా కాగా , సుకుమార్ ఈ సినిమా తోనే దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో ఆర్య 2 అనే మూవీ వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇక ఆర్య 2 సినిమా తర్వాత చాలా సంవత్సరాలకు వీరి కాంబోలో పుష్ప పార్ట్ 1 అనే సినిమా రూపొంది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా వీరి కాంబోలో తాజాగా పుష్ప పార్ట్ 1 మూవీ కి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 సినిమాను రూపొందించారు. ఈ సినిమాను ఈ రోజు అనగా డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. ఇకపోతే ఈ క్రేజీ కాంబో లో ఓ మూవీ మిస్ అయింది అనే విషయం మీకు తెలుసా ..? ఆ సినిమా ఏది .? ఎందుకు మిస్ అయింది అనే వివరాలను తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం సుకుమార్ "జగడం" అనే సినిమాను రూపొందించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో రామ్ పోతినేని హీరో గా నటించాడు. ఇకపోతే ఈ సినిమా కథను సుకుమార్ , అల్లు అర్జున్ కోసం రాసుకున్నాడట. ఇక ఈ మూవీ కథలో నిర్మాత దిల్ రాజు కొన్ని మార్పులు , చేర్పులు సూచించడంతో అది నచ్చని సుకుమార్ వెంటనే ఆ కథను రామ్ పోతినేని కి వినిపించి సినిమా సెట్ చేసుకున్నాడట. అలా అల్లు అర్జున్ కోసం జగడం సినిమా కథను రాసుకున్న కొన్ని కారణాల వల్ల ఆ కథతో జగడం అనే టైటిల్ తో రామ్ తో సుకుమార్ సినిమాను రూపొందించాడట. ఇక మంచి అంచనాల నడుమ విడుదల అయిన జగడం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు.