పాన్ ఇండియా రేంజ్ లో ఏదైనా సినిమాలు విడుదలయితే ఆ సినిమా విడుదల తేది కంటే ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షో, మిడ్ నైట్ షోలు పడిపోతాయి. అలా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న రిలీజ్ అయిన పుష్ప -2 సినిమా డిసెంబర్ 4నే మిడ్ నైట్ షోలు పడిపోయాయి. అయితే అన్ని చోట్ల మిడ్ నైట్ షోలు పడ్డాయి కానీ కేవలం కర్ణాటక రాష్ట్రంలో మాత్రం మిడ్ నైట్ షోలను సడన్ గా రద్దుచేసి పుష్ప టు టీం కి షాక్ ఇచ్చింది కర్ణాటక ప్రభుత్వం. చట్ట ప్రకారం అది విరుద్ధం అని మిడ్ నైట్ షోలను తొలగించింది. అయితే ఇప్పటివరకు విడుదలైన అన్ని సినిమాలకు ఈ మిడ్ నైట్ షోలు రద్దు అనే రూల్ వర్తించలేదు.కానీ కేవలం పుష్ప టు విషయంలో మాత్రమే మిడ్ నైట్ షో లను రద్దు చేసింది అక్కడ ప్రభుత్వం.
అయితే అక్కడ మిడ్ నైట్ షోలు రద్దు చేయడానికి కారణం రష్మిక మందన్నానే అంటున్నారు. అయితే రష్మిక ఎలా కారణమయ్యారంటే.. కన్నడ స్టార్ హీరో కం డైరెక్టర్ అయినటువంటి రిషబ్ శెట్టి నటించిన కాంతారా సినిమా ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి రష్మిక కి ప్రశ్న ఎదురవగా ఆ సినిమా నేను చూడలేదు.. నాకు తెలియదు అనే విధంగా మాట్లాడింది.దాంతో కన్నడిగులు రష్మికపై ఫైర్ అయ్యారు.ఎందుకంటే రష్మిక ఇండస్ట్రీకి వచ్చింది రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా ద్వారానే.
అలాంటిది తనని ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి గురించి తెలియదని కన్నడ సినిమా తెలియదని ఈమె మాట్లాడడం కన్నడిగులకి మండిపడేలా చేసింది . దాంతో కన్నడ ఇండస్ట్రీ రష్మికని బ్యాన్ చేయాలని నిర్ణయించుకున్నారు కూడా.అయితే ఈ కోపంతోనే రష్మిక నటించిన పుష్ప-2 సినిమాకి సంబంధించి మిడ్ నైట్ షో లు రద్దు చేయించారనే రూమర్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.ఇదే కాకుండా రీసెంట్ కన్నడ మూవీ అయినటువంటి భగీర విడుదలైన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి థియేటర్లు దొరకలేదు. దాంతో ఈ కోపంతోనే పుష్ప 2 మిడ్ నైట్ షోలు రద్దు చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా కావాలనే కన్నడ వాళ్ళు పుష్ప-2 సినిమాపై రెవేంజ్ తీర్చుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి