నేషనల్ అవార్డు విన్నర్, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'పుష్ప ది రూల్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా రష్మిక మందన్నా కథానాయికగా నటించింది. ఇక తెలుగు ప్రేక్షకులతో పాటు వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇదిలావుంటే ఈ మూవీపై మాజీ మంత్రి అంబటి రాంబాబుభారీ డైలాగ్స్ తో స్పందించారు. అంబటి ఏమన్నారంటే పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా కాదు వరల్డ్ ఫైర్ అంటూ తన ఎక్స్ ఖాతా లో రాసుకొచ్చారు. ఇదిలావుండగా పుష్ప 2తెలుగు వారికీ పేరు తేవాలని మరో పోస్ట్ లో ఆకాంక్షించారు.ఇదిలావుండగా గతంలో అల్లు అర్జున్ వైసీపీ నేతకు సపోర్ట్ గా ప్రచారం చేయడంతో అప్పట్నుంచి మెగా ఫ్యాన్స్, జనసైనికులు అల్లు అర్జున్ ని వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై విమర్శలు చేస్తున్నారు. కొంతమంది పుష్ప 2 సినిమాని తిప్పికొడతాం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి వాటిపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు.
ఓ ప్రెస్ మీట్ లో ఓ జర్నలిస్ట్ ఈ పుష్ప 2 వివాదం గురించి అడిగిన సంగతి తెలిసిందే.దీనికి అంబటి రాంబాబు స్పందిస్తూ.. అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా పుష్ప పార్ట్ 2ని చూడకుండా ఎవరూ ఆపలేరు. ఎన్టీఆర్ సినిమాని బహిష్కరించాలని ప్రయత్నం చేసారు. కానీ ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని చూస్తే ప్రజలు ఊరుకోరు. బాగున్న సినిమాని ఎవరూ ఆపలేరు. అరచేతిని పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఇలాంటి పోకడలు పోయి సినిమాని ఆపలేరు అని తెలుస్తుంది. అల్లు అర్జున్ అయినా, జూనియర్ ఎన్టీఆర్ అయినా ఎవరి సినిమా అయినా బాగుంటే ఆపలేరు. అందరూ పుష్ప 2 సినిమా చూడాలని ఎదురుచూస్తున్నారు. నేను కూడా ఎదురుచూస్తున్నాను. పుష్ప పార్ట్ 1 అద్భుతంగా ఉంది. హాలీవుడ్ స్టైల్ లో ఉంది. అందర్నీ తలదన్నే విధంగా ఎదిగాడు కదా అల్లు అర్జున్. అందుకే కొంతమందికి జెలసీ గా ఉంది. ఆ జెలస్ తో మీ కడుపులు పుచ్చిపోతాయి. పైకెళ్ళేవాడ్ని ఎవరూ ఆపలేరు. జూనియర్ ఎన్టీఆర్ ని, అల్లు అర్జున్ ని బహిష్కరించాలని ఎవరు అనుకున్నా అవ్వదు. అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగాడు ఇప్పుడు అని అన్న సంగతి తెలిసిందే.ఇదిలావుండగా ప్రస్తుతం పుష్ప 2రిలీజ్ సందర్బంగా అంబటి చేసిన పోస్ట్లు వైరల్గా మారాయి.