సింగిల్ హ్యాండ్ తో మెగా ఫ్యామిలీకి చెక్.. బన్నీ కావాలనే పక్కన పెట్టాడా..?

Pandrala Sravanthi
 అల్లు అర్జున్ ప్రస్తుతం సింగిల్ అయిపోయాడు.ఎందుకంటే ఇన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకొని ఎదిగాడు అని ఎంతో మంది ఈయన్నీ అన్నారు. అయితే ఇండస్ట్రీకి వచ్చినా కొత్తలో అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీ వల్లే ఎదిగాను. చిరంజీవికి వీరాభిమానిని..చిరంజీవి వల్లే ఇక్కడున్నాను అంటూ ఎన్నో డైలాగులు చెప్పేవారు. అయితే ఎవరైనా సరే ఒక రేంజ్ కి వచ్చాక తమకంటూ ఒక సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటారు. అలా అల్లు అర్జున్ కూడా సొంత బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఇన్ని రోజులు మెగా ఫ్యామిలీ చెట్టు కింద ఉన్న ఈయన ఈరోజు వేరుపడి అల్లు ఫ్యామిలి చెట్టుని ఏర్పరచుకున్నారు. పుష్ప పార్ట్ వన్ తోనే అల్లు అర్జున్ క్రేజ్ ఏంటో బాక్సాఫీస్ కి తెలిసి వచ్చింది. ఇక తాజాగా విడుదలైన పుష్ప-2 సినిమా ఈయనకి సొంత బ్రాండ్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టింది. 

అలాగే అల్లు అర్జున్కి పుష్ప సినిమాతో ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా అందుకొని నేషనల్ అవార్డు వచ్చింది. అయితే తన స్నేహితుల కోసం బన్నీ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు. అలా నంద్యాల ఫ్రెండ్ అయినటువంటి వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పటి నుండి మెగా అల్లు ఫ్యామిలిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.అయితే వీరిద్దరి మధ్య ఎంత దూరం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియా జనాలు మాత్రం వీరి మధ్య ఆజ్యం పోస్తూ ఉంటారు.అంతే కాదు కొంతమంది సెలబ్రిటీలు కూడా వీరి మధ్య ఏదో ఒక చిచ్చు పెడుతూనే ఉన్నారు. ఇక పుష్ప-2 సినిమాని ఫ్లాప్ చేయాలని మెగా ఫ్యాన్స్ చాలానే కోరుకున్నట్టు వాళ్ళు చేసే పోస్టులను బట్టి తెలిసిపోయింది .

 కానీ పుష్ప-2 సినిమాలో బన్నీ తన నట విశ్వరూపంతో మ్యాజిక్ చేసి చూపించాడు.తన నటనతో మరోసారి వేరే లెవెల్ అనిపించుకున్నాడు. అలా మెగా ఫ్యామిలీ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్,నాగబాబు, రామ్ చరణ్ ,వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్,వైష్ణవ్ తేజ్ ఇలా ఆ హీరోలందరిని ఒకే ఒక్క సింగిల్ హ్యాండ్ తో అల్లు అర్జున్ ఢీ కొట్టాడు. సింగిల్ హ్యాండ్ తోనే మెగా ఫ్యామిలీకి చెక్ పెట్టిన బన్నీకి ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి మద్దతు దొరుకుతుంది. అయితే ఇన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ఎందుకు పక్కకు తప్పుకున్నారు అనే అనుమానం చాలామందికి వస్తుంది.

అయితే అల్లు అర్జున్ తనకంటూ ఒక సొంత బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే మెగా ఫ్యామిలీ పేరు వాడుకోకుండా నా ఆర్మీ నా ఫ్యాన్స్ అంటూ చెప్పుకుంటూ సొంతంగా ఎదగాలని చూసారు. అందుకే మెగా ఫ్యామిలీని కాస్త సైడ్ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకుంటే మళ్ళీ మెగా ఫ్యామిలీ కిందికే వస్తారని, కాస్త పక్కకు తప్పుకుంటేనే తన బ్రాండ్ ఏంటో ఇండస్ట్రీకి తెలిసి వస్తుంది అనుకున్నాడో ఏమో తెలియదు. ఫైనల్ గా సొంతంగా అయితే బన్నీ ఓ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరూ ఒకెత్తయితే అల్లు అర్జున్ ఒకెత్తు అంటూ బన్నీకి సపోర్ట్ గా నెట్టింట పోస్టులు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: