చిరంజీవి, పవన్ వల్ల కాలేదు... 10 ఏళ్ళ రికార్డు క్రియేట్ చేసిన అల్లు అర్జున్ ?
ఇప్పుడు దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మారు మోగుతోంది. ఎక్కడ చూసినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. బుధవారం అర్ధరాత్రి షోలు పడ్డ తర్వాత... సినిమాపై హైప్ మరింత పెరిగిపోయింది. ఎవరు ఊహించని రీతిలో పుష్ప రెండవ పార్ట్ కు రావడం గమనార్హం. సంధ్య థియేటర్లో ప్రారంభమైన ఈ ప్రభంజనం... ప్రపంచవ్యాప్తంగా దుమ్ము లేపుతోంది. దీనికి తగ్గట్టుగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరలు విపరీతంగా పెంచేసాయి రెండు ప్రభుత్వాలు.
అటు ఏపీ ప్రభుత్వం కూడా పెద్దగా సహకరించలేదు. అయినప్పటికీ తన సినిమాలు నమ్ముకున్న అల్లు అర్జున్.. తొక్కి పట్టి నార తీశాడు. సినిమాను బంపర్ హిట్ చేసుకున్నాడు.ఏపీలో కూడా..అన్ని థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేసేలా..చరిత్ర సృష్టించాడు.చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్ వల్ల కానీ...రికార్డును ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాడు. వ్యతిరేక పవనాలు వీస్తున్న కూడా...దుమ్ము లేపుతున్నాడు బన్నీ. ఇక ఈ రికార్డును పదేళ్లపాటు టచ్ కూడా చేయలేరని అంటున్నారు.