అల్లు అర్జున్ ను అరెస్ట్ చెయకుంటే పుష్ప-2 అడ్డుకుంటాం... పిడిఎస్ యూ...!
ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంతో రేవతి అనే మహిళ చపిపోయిందని ఆమె కుమారుడు చావుబతుకుల ఆమె కుమారుడు చావుబతుకుల మధ్య హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడని ఈ ఘటనకు కారణమైన అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చెయ్యాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పుష్ప-2 సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. పెద్ద ఎత్తున అభిమానులు ప్రమియర్ షో కు వచ్చినప్పుడు బాధ్యతగా వహించాల్సిన అల్లు అర్జున్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు.
ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా నిరాశనలు, ఆందోళన కార్యక్రమాలకు జనం రాకుండా ఆంక్షలు విధించి, నాయకులను క్రమంగా అరెస్టులు చేసే పోలీసులు అర్ధరాత్రి ఓ హీరో తన వ్యక్తిగత స్వలాభం కోసం వస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలా ఆహ్వానించారు చెప్పాలన్నారు. సినిమా వినోదాలను పంచే విధంగా ఉండేలే కానీ విషాదాలను మిగిల్చేలా ఉండకూడదన్నారు. ఇప్పటికే సినిమా టికెట్లు రేట్ల ను రూ.3 వేల వరకు పెంచి పెద, మధ్య తరగతి సినిమా అభిమానుల జేబులను గుల్ల చేశారని ధ్వజమెత్తారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఈ ఘటనలో థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.