కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమాలకు భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చేవి కావు. ఏదైనా సినిమాలకు 100 కోట్ల కలెక్షన్లు వచ్చాయి అంటే దానిని పెద్ద విషయంగా చూసేవారు. ఇక ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో అప్పటి నుండి తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి మొదటి భాగాన్ని తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. దానితో ఈ మూవీ కి వందల కోట్ల కలెక్షన్లు వచ్చాయి.
ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన బాహుబలి 2 సినిమా ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. దానితో తెలుగు సినిమా రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి నుండి తెలుగు సినిమా పరిశ్రమ నుండి భారీ సినిమాలు వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఈ సినిమా 1200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇకపోతే కొంత కాలం క్రితం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా కూడా 1000 కోట్లకి పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక తాజాగా అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించాడు. పుష్ప పార్ట్ 1 మూవీ అద్భుతమైన విజయం అందుకోవడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమాకే 600 కోట్లకు పైగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ హిట్ స్టేటస్ ను అందుకోవాలి అన్నా కూడా ఈ మూవీ 1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టాలి.
ఇక ఈ సినిమాకు కూడా మంచి టాక్ రావడంతో ఈ సినిమా ఈజీగా వెయ్యి కోట్ల కలెక్షన్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది భావిస్తున్నారు. అలా ఈ సినిమా కనుక 1000 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్లయితే ప్రభాస్ , రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ తర్వాత టాలీవుడ్ హీరోలలో 1000 కోట్ల కలెక్షన్లను అందుకున్న హీరోల లిస్టులో అల్లు అర్జున్ చేరుతాడు. మరి పుష్ప పార్ట్ 2 మూవీ 1000 కోట్ల కలెక్షన్లను సాధిస్తుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.