పుష్ప2 హిట్ అవ్వడం రష్మిక పాలిట శాపంగా మారిపోతుందా..? వైరల్ అవుతున్న లేటెస్ట్ న్యూస్..!

Thota Jaya Madhuri
ఏది జరిగిన మన మంచికే అంటూ ఉంటారు మన పెద్దలు. కానీ కొన్ని కొన్ని సార్లు అది మనకి బ్యాడ్ గా కూడా మారుతుంది . ఇప్పుడు రష్మిక మందన్నాకు పుష్ప2 సినిమా హిట్ అయితే ఎలా బ్యాడ్ గా మారిందో అలా. యస్ పుష్ప 2 సినిమా హిట్ అయ్యింది. అంతా బాగానే ఉంది. సినిమాలో నటించిన నటీనటులకి కూడా మంచి మార్కులే పడ్డాయి. ఇన్నాళ్లు రష్మిక మందన్నా- బన్నీ పేర్లు చాలా చాలా ట్రోల్ చేశారు జనాలు. అయితే పుష్ప2 సినిమాతో అది మొత్తం మారిపోయింది .


రష్మిక మందన్నా ను ఓ దేవతలా చూస్తున్నారు . అంతేకాదు రష్మిక మందన్నా నటించిన తీరుని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ ఎలా చెప్తే అలా ఈ సినిమాలో మెరిసింది అని.. ఈ సీన్స్ చేయొచ్చా..? ఈ సీన్స్ చేయకూడదా..? అంటూ ఏమాత్రం ఆలోచించకుండా బన్నీకు ఫుల్ గా కో ఆపరేట్ చేసి మరి పుష్ప2 హిట్ లో భాగమైంది అంటూ జనాలు ఓ రేంజ్ లో ప్రశంసిస్తున్నారు. అయితే రష్మిక మందన్నా ఫ్యాన్స్ కు పుష్ప2 సినిమా హిట్ అవ్వడం ప్లస్ గా మారిన ..ఆ తర్వాత రష్మిక మందన్నా.. లైఫ్ ఏంటి అన్న విషయం ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.


రష్మిక మందన్నా పుష్ప2 తో హిట్ కొట్టింది . ఓకే ఈ ముచ్చట కొన్నాళ్ళు ఉంటుంది . దెన్ వాట్ నెక్స్ట్..? సినిమా హిట్ అవుతుందా..? ఫట్ అవుతుందా ..? అసలు రష్మిక తన కెరీర్ లో మళ్ళీ పుష్ప2 సినిమా లాంటి హిట్టు అందుకుంటుందా..? అనే విధంగా మాట్లాడుకుంటున్నారు . రష్మిక సినిమాలో నటించిన తీరు చాలా అద్భుతంగా ఉంది . మళ్లీ దానికన్నా అద్భుతంగా నటిస్తే రష్మిక నటన పర్ఫామెన్స్ ను అభిమానులు ఓ రేంజ్ లో పొగిడేయగలరు. అయితే నెక్స్ట్ రష్మిక మందన్నా కమిట్ అయిన మూవీస్ అంతా చెప్పుకోదగ్గవి కాదు.  పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయినా సరే శ్రీవల్లి పాత్ర మళ్ళీ ఆమెకు వస్తుంది అనడంలో కొంచెం డౌట్ కొడుతుంది . దీంతో పుష్ప 2 సినిమా హిట్ అవ్వడం రష్మిక పాలిట కొంచెం శాపంగా మారింది అన్న విధంగా మాట్లాడుతున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: